కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్, టాప్ సీడ్ తరుణ్ మన్నేపల్లి పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తరుణ్ 9–21, 20–22తో మొహమ్మద్ యూసుఫ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తరుణ్ తొలి గేమ్‌లో తేలిపోయినా... రెండో గేమ్‌లో ప్రత్యరి్థకి గట్టిపోటీ ఇచ్చాడు.
భారత్‌కే చెందిన రౌనక్ చౌహాన్, కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రౌనక్ 21–19, 22–20తో శంకర్ ముత్తుస్వామి (భారత్)పై, కిరణ్ జార్జి 21–11, 21–17తో రితి్వక్ (భారత్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ ఖాయమైంది. భారత్‌కు చెందిన నలుగురు క్రీడాకారిణులు ఉన్నతి హుడా, ఇషారాణి బారువా, తాన్యా హేమంత్, తస్నిమ్ మీర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు.


