సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ చందానాయక్ తండా హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థులకు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో నానక్‌రామ్‌గూడ రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


