స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించి షాకింగ్‌ న్యూస్‌ | Steve Smith drops shocking hint at early retirement after Ashes triumph | Sakshi
Sakshi News home page

స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించి షాకింగ్‌ న్యూస్‌

Jan 8 2026 1:15 PM | Updated on Jan 8 2026 1:33 PM

Steve Smith drops shocking hint at early retirement after Ashes triumph

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించి షాకింగ్‌ వార్త తెలుస్తుంది. త్వరలో అతను టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానన్న సంకేతాలు ఇచ్చాడు. కమిన్స్‌ గైర్హాజరీలో తాత్కాలిక సారధిగా వ్యవహరించి స్వదేశంలో యాషెస్‌ సిరీస్‌ (4-1) గెలిచిన అనంతరం స్టీవ్‌ తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఫాక్స్‌ టీవీతో మాట్లాడతూ ఇలా అన్నాడు. స్వదేశంలో మరోసారి యాషెస్‌ గెలిచినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇదే సిరీస్‌ను ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో గెలవలేకపోయాను. అది సాధించాలని ఉంది. కానీ,  వచ్చే ఏడాది (2027) అక్కడ ఉంటానో లేదో తెలీదంటూ పరోక్షంగా తన రిటైర్మెంట్‌పై సంకేతాలు పంపాడు.  

స్టీవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ సర్కిల్స్‌లో దుమారం రేపుతున్నాయి. స్టీవ్‌ టెస్ట్‌ ప్రస్తానంపై మరో రెండు, మూడేళ్లు ఆశలు పెట్టుకున్న ఆసీస్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. స్టీవ్‌ రిటైర్మెంట్‌ ఇప్పట్లో ఆలోచన పెట్టుకోవద్దంటూ ఫ్యాన్స్‌ నెట్టింట సందేశాలు పంపుతున్నారు. మొత్తంగా స్టీవ్‌ ఎడిసోడ్‌ ఆసీస్‌ అభిమానులకు యాషెస్‌ గెలిచామన్న సంతోషాన్ని మిగలకుండా చేస్తుంది.

కాగా, స్వదేశంలో యాషెస్‌ సిరీస్‌ను 4-1 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై మరోసారి ఆధిపత్యాన్ని చాటింది. ఈ సిరీస్‌లో ఆసీస్‌ ఇంగ్లండ్‌పై అన్ని విభాగాల్లో పైచేయి సాధించి తిరుగులేని జట్టుగా నిలిచింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా, ఉన్న వాళ్లతో స్టీవ్‌ అద్భుతంగా జట్టును ముందుండి నడిపించాడు. ట్రవిస్‌ హెడ్‌, మిచెల్‌ స్టార్క్‌, అలెక్స్‌ క్యారీ ఈ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్టీవ్‌ స్వయంగా కూడా రాణించాడు.

యాషెస్‌ ట్రోఫీ అందుకున్న తర్వాత స్టీవ్‌ తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ కమిన్స్‌ చేతికి దాన్ని అందించి అభిమానుల హృదయాలను గెలిచాడు. సిరీస్‌ ఆధ్యాంతం రాణించిన స్టార్క్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌.. ఇవాళ ముగిసిన చివరి టెస్ట్‌లో సత్తా చాటిన ట్రవిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు లభించాయి.

ఈ సిరీస్‌తో ఆసీస్‌ తమ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరి సేవలు కోల్పోనుంది. వెటరన్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ సిరీస్‌లో ఆసీస్‌ హాజిల్‌వుడ్‌ (5 టెస్ట్‌లు), కమిన్స్‌ (4 టెస్ట్‌లు), నాథన్‌ లియోన్‌ (3 టెస్ట్‌లు), స్టీవ్‌ స్మిత్‌ (ఒక టెస్ట్‌) సేవలు వినియోగించుకోకుండానే ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం విశేషం.

 

Advertisement
 
Advertisement
Advertisement