
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్(104) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు.
నిప్పులు చెరిగిన బుమ్రా..
రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పులు చెరిగాడు. బుమ్రా ఆరంభంలోనే బెన్ స్టోక్స్, రూట్, వోక్స్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను కార్స్, స్మిత్ చక్కదిద్దారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని సిరాజ్ బ్రేక్ చేశాడు.
అనంతరం ఆర్చర్‌ను ఔట్ చేసిన బుమ్రా.. లార్డ్స్‌లో తొలి ఫైవ్ వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. రవీంద్ర జడేజాకు ఒక్క వికెట్ దక్కింది.
చదవండి: IND vs ENG: బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైరల్