
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్‌లో అత్యత్తుమ బౌలర్లలో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే ప్రత్యర్ధి గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అతడు మరోసారి తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు.
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను బుమ్రా ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. స్టోక్స్‌ను అద్బుతమైన బంతితో జస్ప్రీత్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
స్టోక్స్ మైండ్ బ్లాంక్..
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 86 ఓవర్ వేసిన బుమ్రా.. రెండో బంతిని రౌండ్‌ది వికెట్ నుంచి గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్స్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఔట్ సైడ్ ఆఫ్ దిశగా పడిన బంతి కొంచెం స్వింగ్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.
దీంతో ఒక్కసారిగా స్టోక్స్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి రోజు ఆటలో కూడా ఇదే తరహాలో హ్యారీ బ్రూక్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టోక్స్‌ను ఔట్ చేసిన అనంతరం జో రూట్(104), క్రిస్ వోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా ఇప్పటివరకు బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
లంచ్ బ్రేక్‌కు భారత స్కోరంతంటే?
రెండో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. క్రీజులో జేమీ స్మిత్(51), బ్రాడైన్ కార్స్(33) ఉన్నారు.
Jasprit Bumrah takes three big wickets Root, Stokes & Woakes in just 7 balls.
He flipped the match in a single spell.⁰Game-changer. Match-winner. Jasprit Bumrah 🐐⁰#INDvsENG #ENGvIND
pic.twitter.com/Wq19z1glb5— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025