భారత్‌తో రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టుతో చేరిన ప్రొటిస్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘వికెట్ పాత బడుతున్న కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. తేమ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మేము తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం.
అయితే, పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందో ముందుగా చెప్పడం కష్టమే. గత మ్యాచ్‌లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. నాతో పాటు కేశవ్ మహరాజ్ (Keshav Maharan), లుంగి ఎంగిడి తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ మాకెంతో కీలకమైనది’’ అని పేర్కొన్నాడు.
కాగా భారత్‌తో తొలి వన్డేలో విఫలమైన సఫారీ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌పై వేటు పడగా.. పేసర్లు ప్రెనేలన్ సుబ్రేయన్, ఒట్నీల్ బార్ట్‌మన్ తమ స్థానాలు కోల్పోయారు.
తుది జట్టులో మార్పులు లేవు
మరోవైపు.. మరోసారి టాస్ ఓడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘకాలంగా మేము టాస్ గెలవలేకపోతున్నాం. ఏదేమైనా గత మ్యాచ్‌లో మా ప్రదర్శన అద్భుతంగా సాగింది. ప్రత్యర్థి జట్టు కూడా గట్టి పోటీనిచ్చింది.
పరుగులు సాధించడంతో పాటు.. వరుస విరామాల్లో వికెట్లు తీస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలము.ఈ వికెట్ బాగుంది. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.
ఆధిక్యంలో టీమిండియా
కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా ఆదివారం తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 17 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.
ఈ మ్యాచ్‌లో భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli) శతక్కొట్టడం (135), రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) రాణించడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలోనూ రో-కో ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు మరోసారి చితక్కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో వన్డే తుదిజట్లు
👉వేదిక: షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్‌పూర్
👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్
భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.
సౌతాఫ్రికా తుదిజట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.


