బ్యాటింగ్ కోచ్ సితాన్షు స్పష్టీకరణ
రాంచీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదివారం తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. గత కొంత కాలంగా జట్టులో కోహ్లి స్థానంపై, 2027 వరల్డ్ కప్ వరకు ఆడటంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్‌లోనూ అతని ప్రదర్శనపై అందరి దృష్టీ నిలుస్తోంది. అయితే ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఖండించాడు. కోహ్లి భవిష్యత్తు అనేది అసలు చర్చించాల్సిన అంశమే కాదని అతను స్పష్టం చేశాడు.
ఇంత బాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంకేం ఆశిస్తామని కొటక్ వ్యాఖ్యానించాడు. ‘కోహ్లి గురించి ఈ తరహాలో ఆలోచించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. అతను చాలా గొప్పగా ఆడుతున్నాడు. అసలు అతని భవిష్యత్తుపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అతని ఆట, ఫిట్‌నెస్ చూస్తే మరో చర్చకు తావు లేదు. కోహ్లి బ్యాటింగ్ అసాధారణంగా ఉంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే మరో విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
కోహ్లి, రోహిత్ ఇద్దరూ జట్టు విజయంలో తమ పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరికీ ఎంతో అనుభవం ఉంది. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. జట్టు విజయంలో వారి భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది’ అని కొటక్ భారత్ బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మంచు ప్రభావం కారణంగా తమ బౌలర్లను పట్టు చిక్కలేదని, అందుకే దక్షిణాఫ్రికా కూడా భారీగా పరుగులు సాధించి విజయానికి చేరువగా రాగలిగిందని విశ్లేíÙంచిన కొటక్...ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యరి్థని కట్టడి చేసిన హర్షిత్ రాణాపై ప్రత్యేకంగా ప్రశంసించాడు.


