ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పీట్రాంగెలి(92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో రోమ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్, పాడెల్ పెడరేషన్ ధ్రువీకరించింది.
కాగా పీట్రాంగెలి ఇటలీ టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక ఇటాలియన్ ప్లేయర్ నికోలానే కావడం విశేషం. డేవిస్ కప్ మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా కూడా పొందారు. ఆయన తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు.
కాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన మొట్టమొదటి ఇటాలియన్ ఆటగాడు కూడా నికోలానే. 1959, 1960లో రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన వారసత్వాన్ని జానిక్ సిన్నర్, మాటియో బెరెట్టినిల వంటి యువ సంచలనాలు ముందుకు తీసువెళ్తున్నారు. నికోలా పీట్రాంగెలి మృతి పట్ల ఇటలీ ప్రధాన మంత్రి జియోర్జియా మెలోనీ, స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ సంతాపం వ్యక్తం చేశారు.


