ఇంటర్నేషనల్‌ సంస్థతో హీరోమోటోకార్ప్ జట్టు | Hero MotoCorp Makes its Debut in Italy | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్‌ సంస్థతో హీరోమోటోకార్ప్ జట్టు

Oct 14 2025 5:14 PM | Updated on Oct 14 2025 7:31 PM

Hero MotoCorp Makes its Debut in Italy

అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా.. ఇటలీ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ద్విచక్ర వాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) వెల్లడించింది. ఇందుకోసం స్థానిక పెల్పి ఇంటర్నేషనల్‌ సంస్థతో జట్టు కట్టినట్లు తెలిపింది. ప్రాథమికంగా కీలక నగరాల్లో 36 మంది డీలర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు, క్రమంగా ఈ సంఖ్యను 54కి పెంచుకోనున్నట్లు తెలిపింది.

ముందుగా ఎక్స్‌పల్స్‌ 200 4వీ, ఎక్స్‌పల్స్‌ 200 4వీ ప్రో, హంక్‌ 440ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ భాన్‌ తెలిపారు. తమకు అంతర్జాతీయంగా ఇది 49వ మార్కెట్‌ అని వివరించారు. ద్విచక్ర వాహనాల పంపిణీ, సేల్స్, సర్వీసెస్ వంటివాటికి సంబంధించి 160 మంది డీలర్లతో ఇటలీలో అతి పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటిగా పెల్పి ఇంటర్నేషనల్‌ కార్యకలాపాలు సాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement