ఇరాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. మృతులు ఎంతమందంటే | Iranian Army Training Helicopter Crashes In Isfahan Province, Six Killed Along With Pilot And Co Pilot | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. మృతులు ఎంతమందంటే

Feb 24 2026 4:42 PM | Updated on Feb 24 2026 4:58 PM

Helicopter crashes in Iran

టెహ్రాన్‌: ఇరాన్‌లో  ఓ ట్రైనీ హెలికాప్టర్ జనావాస ప్రాంతాల్లో కుప్పకూలింది. మధ్య ఇరాన్‌ ప్రాంతంలోని ప్రూట్‌ మార్కెట్‌ ప్రదేశంలో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైలట్లతో పాటు నలుగురు మృతిచెందారు. రాజధాని టెహ్రాన్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ప్రావిన్సులో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ ఆర్మీ ట్రైనీ ట్రయల్స్  జరుపుతుందని తెలుస్తోంది. ఇద్దరు ఫైలట్లతో పాటు మరో ఇద్దరు సాధారణ ప్రజలు ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు. అయితే ఇటీవలే F-4 ఫాంటమ్ జెట్ కూలిన ఘటనలో ఒక ఫైలట్ మృతిచెందాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది.

అయితే ఈ ప్రమాదం జరిగిన ఇస్ఫహాన్ ప్రావిన్సులో ఇరాన్ అణుస్థావరం ఉంది. గతేడాది ఇరాన్‌ లోని మూడు అణు స్థావరాలపై ఇస్ఫహాన్ ఫోర్దో,  నతాంజ్‌ అణుస్థావరాలపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement