ఇరాన్-అమెరికా ఉద్రిక్తత.. భారత్ కీలక నిర్ణయం | Leave Iran alone key instructions from the India | Sakshi
Sakshi News home page

ఇరాన్-అమెరికా ఉద్రిక్తత.. భారత్ కీలక నిర్ణయం

Feb 23 2026 6:11 PM | Updated on Feb 23 2026 6:49 PM

Leave Iran alone key instructions from the India

టెహ్మాన్ : ప్రస్తుతం ఇరాన్-యుఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య ఏ క్షణానైనా యుద్ధం మెుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ ఏ విధంగా నైనా తక్షణమే ఇరాన్‌ని వదిలేయాలని ఆదేశించింది.

ఇరాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ దేశంపై ఏ క్షణానైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉండడంతో తమ పౌరులను తమ స్వస్థలాలకు తిరిగిరావాలని ఆదేశిస్తున్నాయి. తాజాగా భారత్‌ సైతం ఈ జాబితాలో నిలిచింది. ఇరాన్‌లో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా ఆదేశాన్ని వదలాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

"ఇరాన్‌లో భారత్‌కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, వర్తకులు, పర్యాటకులు ఇలా ఎవరు ఆదేశంలో ఉన్న వెంటనే ఇరాన్‌ని వీడాలి. మీకు అందుబాటులో ఉన్న ఏ రవాణా మార్గన్నైనా వాడి  అక్కడి నుండి బయిటపడండి.  ప్రయాణానికి  కావాల్సిన ధృవపత్రాలు ఐడీకార్డులు మీతో ఉంచుకొండి. ఏదైనా అవసరముంటే అక్కడి ఇండియన్ ఎంబసీని సంప్రదించండి" అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

అయితే ఇరాన్‌లో ఇటీవల జరిగిన నిరసనల నేపథ్యంలో భారత పౌరులు గొడవలు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని భారత్ సూచించింది. కాగా ప్రస్తుతం ఆ భూభాగాన్ని వీడాలని ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ మధ్య వచ్చే గురువారం అణు ఒప్పందం విషయంలో చర్చలు జరగనున్నాయి. ఈ వివరాలను ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి బదర్ అల్ బుసైదీ తెలిపారు. అయితే ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ట్రంప్  ఇరాన్‌పై దాడి చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement