ఆ దాడి చేసింది మేమే.. BLA ప్రకటన | BLA claims to have attacked Pakistan Army | Sakshi
Sakshi News home page

ఆ దాడి చేసింది మేమే.. BLA ప్రకటన

Feb 24 2026 3:26 PM | Updated on Feb 24 2026 3:32 PM

BLA claims to have attacked Pakistan Army

బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 22న పాకిస్థాన్ సైనిక దళాలపై జరిగిన దాడికి BLA దే బాధ్యత అని ‍ప్రకటించింది. బలూచిస్థాన్‌నికి స్వతంత్ర్యం కల్పించేంతవరకూ ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 22న  అలహాబాద్ ప్రాంతంలోని మాచ్ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రత బలగాల కాన్వాయిపై మెరుపుదాడి జరిగింది. ఈ అటాక్‌లో పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన నలుగురు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ దాడికి తమదే బాధ్యతని BLA ప్రకటించింది. పాక్‌ ఆక్రమణలో ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని BLA స్పోక్స్ పర్సన్ ఆజాద్ బలూచ్ తెలిపారు.

అయితే అంతకుముందు బలూచిస్థాన్‌ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడింది. ఇటీవల ఆ సైన్యం జరిపిన దాడుల్లో 177 మందికి పైగా మృతిచెందారు. BLA ఆర్మీకి  వారికి ఎటువంటి సహాయక చర్యలు అందకుండా ఉండేందుకు  రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్‌ను కట్ చేసింది. 

అయితే బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్‌వర్క్ మెుత్తంగా 4 నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని పాక్ మంత్రి   అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement