భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బుధవారం(డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా మాత్రం తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాకు ఓ గుడ్ న్యూస్ అందింది.
వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ టెంబా బవుమా, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తిరిగి తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. వీరిద్దరి రాకతో క్వింటన్ డికాక్, ప్రేనేలన్ సుబ్రాయెన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. ఈ ఇద్దరు ప్రోటీస్ ఆటగాళ్లు తొలి వన్డేలో దారుణంగా విఫలమయ్యారు.
ఇక రాంచీ వన్డేలో బవుమా గైర్హజరీలో ప్రోటీస్ కెప్టెన్‌గా ఐడైన్ మార్‌క్రమ్ వ్యవహరించాడు. ఇప్పుడు రెండో వన్డేలో బవుమా తిరిగి జట్టు పగ్గాలను చేపట్టడం దాదాపు ఖాయం. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బవుమా ఎడమ కాలి గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు పాక్ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు.
ఆ తర్వాత అతడు భారత్‌తో టెస్టు సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడి నాయకత్వంలోనే ప్రోటీస్ జట్టును భారత్‌తో టెస్టు సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. బవుమా ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. కానీ తర్వాత వరుస సిరీస్‌ల నేపథ్యంలో అతడికి తొలి వన్డేకు విశ్రాంతి ఇచ్చారు. కానీ ఇప్పుడు సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 వెనకంజలో ఉండడంతో అతడి పునరాగమనం అనివార్యమైంది.
రెండో వన్డేకు సౌతాఫ్రికా తుది జట్టు: ర్యాన్ రికెల్టన్, ఐడైన్ మార్‌క్రమ్, టెంబా బవుమా, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నాంద్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్
చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్‌కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్‌కు ఛాన్స్?


