ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో.. | Oakley Meta Glasses With Meta AI Integration Now Available for Purchase in India | Sakshi
Sakshi News home page

ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో..

Dec 1 2025 7:58 PM | Updated on Dec 1 2025 8:14 PM

Oakley Meta Glasses With Meta AI Integration Now Available for Purchase in India

ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్‌లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.

భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్‌లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.

ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్‌గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద 3K వీడియో రిజల్యూషన్‌లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్‌లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement