2026 ప్రారంభంలో సీలియన్ 7 ధరలు పెరుగుతాయని బీవైడీ ఇండియా ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు.. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎల్డబ్ల్యుబీ, టెస్లా మోడల్ వై, కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5, వోల్వో ఈసీ40 వంటివాటికి ప్రత్యర్థిగా ఉంది.
బీవైడీ సీలియన్ 7 ధరలు రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షల (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి. డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకున్న వారికి ఈ ధరలే వర్తిస్తాయి. 2026 జనవరి 1 నుంచి ధరల్లో మార్పులు జరగనున్నాయి. కాబట్టి అప్పుడు బుక్ చేసుకున్న వారికి కొత్త ధరలు వర్తిస్తాయి. అయితే కంపెనీ ధరలను ఎంత పెంచుతుందనే విషయాన్ని వెల్లడించలేదు.
భారతదేశంలో ఇప్పటివరకు 2,000 యూనిట్లకు పైగా సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది 82.56kWh బ్యాటరీ ఎంపికలో అందుబాటులో ఉంది. ప్రీమియం వేరియంట్‌లో 313hp & 380Nmలను అభివృద్ధి చేసే రియర్ మౌంటెడ్ మోటారుకు శక్తినిస్తుంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ముందు ఇరుసులో మోటారు ఉంటుంది. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లు వరుసగా 482 కిమీ, 456 కిమీ రేంజ్ అందిస్తాయి.


