దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం రికార్డు గరిష్టాలను తాకిన స్టాక్ సూచీలు తర్వాత స్వల్ప నష్టాలతో ఫ్లాట్గా స్థిరపడ్డాయి. ఫారిన్ ఇన్ఫ్లోలు మందగించడం, కీలక వాణిజ్య చర్చలపై దీర్ఘకాల అనిశ్చితి మధ్య రూపాయి కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తగ్గించింది.
ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 64.77 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 85,641.9 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.2 పాయింట్లు లేదా 0.1 శాతం నష్టపోయి 26,175.75 వద్ద ఉన్నాయి. ప్రారంభ డీల్స్లో సెన్సెక్స్ 86,159 వద్ద రికార్డు స్థాయిని తాకగా, నిఫ్టీ 26,325.8 వద్ద రికార్డు స్థాయిని తాకింది.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ముగియగా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం పెరిగింది. రంగాల సూచీలలో నిఫ్టీ రియల్టీ 1 శాతానికి పైగా పడిపోగా హెల్త్కేర్, ఫార్మా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు అనుసరించాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఆటో, మెటల్, ఐటీ సూచీలు గ్రీన్లో స్థిరపడ్డాయి.
సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. టాటా మోటార్స్ పీవీ, మారుతి సుజుకి, భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.


