ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్లు లేదా 0.04 శాతం నష్టపోయి 85,683 వద్ద ఉండగా, నిఫ్టీ 25 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 26,190 వద్ద ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండు సూచీలు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్ లో తాజా ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. మొదటిసారిగా సెన్సెక్స్ 86,000, నిఫ్టీ 26,300 స్థాయిలను అధిగమించాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం పడిపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


