మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్! | Robert Kiyosaki Warns Market Crash Is Accelerating Urges Investment In Gold Bitcoin And Oil, Check Out His Viral Post Inside | Sakshi
Sakshi News home page

మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్!

Mar 13 2026 4:19 PM | Updated on Mar 13 2026 5:31 PM

Robert Kiyosaki Warns Market Crash Is Accelerating Urges Investment in Gold Bitcoin and Oil

చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్‌లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.

ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.

కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్‌కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.

మార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement