breaking news
market crash
-
Operation Sindoor: కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. గురువారం పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ గంటసేపు నిలిచిపోయింది. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కేఎస్ఈ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయి.. వరుసగా రెండవ సెషన్లో కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కేఎస్ఈ 100 13 శాతం క్షీణించగా, కేఎస్ఈ 30 ఇప్పటివరకు 14.3 శాతం పడిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాక్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ముగిసింది. ఈ రోజు కూడా భారీ నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది. -
'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్ పోస్ట్‌కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025 -
భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత.. ఎందుకంటే..
ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి కియోసాకి ప్రస్తుత మార్కెట్ అనిశ్చితులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి వరుసగా పతనమవుతున్న అమెరికా మార్కెట్లను ఉద్దేశించి ‘చరిత్రలోనే భారీ పతనం రాబోతోందని భయంగా ఉంది. ఇది 1929 స్టాక్ మార్కెట్ పతనాన్ని కూడా అధిగమించగలదు’ అని తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కీలక వివరాలు పోస్ట్ చేశారు.‘మార్కెట్ బుడగలా ఎగిసిపడుతోంది. రాబోయే మార్కెట్ క్రాష్ చరిత్రలోనే అతిపెద్దది కావచ్చని భయమేస్తుంది. జర్మనీ, జపాన్, అమెరికా మార్కెట్లు ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించాయి. దురదృష్టవశాత్తు అసమర్థ నాయకులు పెట్టుబడిదారులను ఉచ్చులోకి నెట్టారు. ఈ క్రాష్ గురించి నేను నా పుస్తకం ‘రిచ్డాడ్స్ ఫ్రొఫెసీ’లో రాశాను. ఇది 1929 గ్రేట్ డిప్రెషన్‌కు దారితీసిన పతనం కంటే పెద్దదిగా ఉండబోతుంది. ఈ సందర్భంలో కలవరపడటం, భయపడటం సాధారణం. కానీ అలా చేయకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. 2008 మార్కెట్ పతనం సమయంలో భయాందోళనకు గురికాకుండా అమ్మకానికి ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి అందులో పెట్టుబడి పెట్టాను. డీప్ డిస్కౌంట్ల్లో వాటిని పొందాను. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మార్కెట్ భయాలు మీ జీవితకాలంలో అవకాశంగా మారొచ్చు. మార్కెట్ అంశాలు ఎంత తీవ్ర రూపం దాల్చినా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకు అనుగుణంగా మెరుగైన అవకాశాలు ఎంచుకొని పెట్టుబడి పెట్టండి. నేను రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్కాయిన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తాను’ అన్నారు.THE EVERYTHING BUBBLE is bursting. I am afraid this crash may be the biggest in history.Germany, Japan, and America have been the engines up to now. Unfortunately our incompetent leaders led us into a trap….giant crash.I wrote about this crash in my book RICH DAD’s…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2025ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టంనాస్డాక్ కాంపోజిట్ ఇటీవల 4 శాతానికి పైగా పడిపోగా, ఎస్ అండ్ పీ 500 దాదాపు 2.7 శాతం దిగజారింది. ఇది ఫిబ్రవరిలో దాని ఆల్ టైమ్ హై నుంచి 8.5 శాతం తగ్గింది. అమెరికా వాణిజ్య విధానాలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. సుంకాల ప్రభావంపై అమెరికా, కెనడా, మెక్సికోలోని ఆర్థికవేత్తల్లో ఆందోళన పెరుగుతోందని రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లో నిర్వహించిన సర్వేలో భాగంగా 74 మంది ఆర్థికవేత్తల్లో 70 మంది ఆర్థిక మాంద్యం ముప్పు పెరిగిందని, ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణానికి అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్ మన్ శాక్స్ తన 2025 అమెరికా వృద్ధి అంచనాను దిగువకు సవరించింది.