Iran War: ప్రపంచవ్యాప్తంగా ఏ ఉపద్రం వచ్చినా, భౌగోళికంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా ముఖ్యంగా యుద్ధం వచ్చిందంటే ముందుగా ప్రభావితమయ్యేది దేశీయ స్టాక్ మార్కెట్లు. తాజాగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మధ్యప్రాచ్య అనిశ్చితి, హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు సంక్షోభం భారత మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా గత నాలుగేళ్లలో అత్యంత దారుణమైన వారంగా ఈ వారం నిలిచింది. ఈ దారుణ పతనంతో పెట్టుబడిదారులు దాదాపు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను కూడా బలహీనపరిచిందని, కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.
75వేల దిగువకు సెన్సెక్స్, మార్కెట్ క్యాప్ నష్టం
ఈ వారం వీకెండ్ శుక్రవారం రోజు సెన్సెక్స్ 1,442 పాయింట్లు కోల్పోయి 75వేల పాయింట్ల (74,592 పాయింట్ల వద్ద ముగిసింది)దిగువకు చేరింది. ఒక రోజులో దాదాపు రూ.9.8 లక్షల కోట్ల సందప తుడిచి పెట్టుకుపోయింది. ఫలితంగా రూ.19 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్ వాల్యుయేషన్ రూ.430 లక్షల కోట్లకు చేరింది. FIIలు అమ్మకాల భారీగా కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ టాటా స్టీల్ , SBI, భారత్ ఎలక్ట్రానిక్స్ , మారుతి టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
మునుపటి శుక్రవారం అంటే మార్చి 6న బీఎస్‌సీ సెన్సెక్స్ 78,918 వద్ద ముగిసింది. అప్పటి మార్కెట్ వాల్యుయేషన్ రూ.449.35 లక్షల కోట్లుగా ఉంది.ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి.
ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
నిఫ్టీ నష్టాలు ఇలా..
ఇక నిఫ్టీ 468 పాయింట్లు క్షీణించి 23,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి 5న నమోదైన గరిష్ట స్థాయి 26,373 పాయింట్లు. అంటే 10 శాతం క్షీణించింది. భారత మార్కెట్లు చివరిసారిగా ఈ స్థాయిలో నష్టాలను చవిచూసింది 2022 జూన్‌లో మాత్రమే. బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 102 డాలర్లకు పెరగడం ఈ వారం పెట్టుబడిదారులకు ఒక పీడకల చెప్పవచ్చు.
ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చమురు సంక్షోభం- మార్కెట్లు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చమురు సరఫరాపై ప్రభావం ముడిచమురు ధరలను అమాంతం పెరిగాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా, జపాన్, చైనా , హాంకాంగ్‌ల సూచీలు దిగువన ముగిశాయి.
(తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు)


