న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజ్ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా 20 మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. అంతేకాకుండా పలు లా, ఇంటర్మీడియెరీ సంస్థలను సైతం ఎంపిక చేసుకుంది. శ్రీనివాస్ ఇంజేటి అధ్యక్షతన ఎన్‌ఎస్‌ఈ ఐపీవో కమిటీ ఇందుకు అనుమతించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఎస్‌ఈ బోర్డ్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీవోపై ముందుకెళ్లేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజా ఎంపికలను చేపట్టింది. ఎంపికైన మర్చంట్ బ్యాంకర్లలో కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ తదితరాలున్నాయి.


