పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో గిఫ్ట్ సిటీ తొలి పబ్లిక్ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభంకానుంది. ఎగ్జిక్యూటివ్ లెర్నింగ్ సొల్యూషన్ల కంపెనీ ఎక్స్‌ఈడీ ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఐపీవో నిజానికి ఈ నెల 6న ప్రారంభంకావలసి ఉంది. అయితే యుద్ధ అనిశ్చితుల కారణంగా తేదీలో మార్పు చేసింది.
ఐఎఫ్‌ఎస్‌సీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటైన దేశీ ఐఎఫ్‌ఎస్‌సీ నుంచి తొలిసారి ఐపీవోకు వస్తున్న కంపెనీ 1.2 కోట్ల డాలర్ల సమీకరణపై కన్నేసింది. ఇందుకు షేరుకి 10–10.5 డాలర్ల ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ముగియనుంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు)సహా.. ఎన్‌ఆర్‌ఐలు తదితర అనుమతించిన ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.
ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు లక్ష్యంగా ఈ షేర్లు డాలర్ల రూపేణా ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్(గిఫ్ట్ సిటీ)లో లిస్ట్ కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సీనియర్ వృత్తి నిపుణులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సరీ్వసులు అందిస్తోంది. భారత్‌సహా.. పశ్చిమాసియా, దక్షిణాసియా, ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు విస్తరించింది.


