ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో విక్రయించే తమ వాహనాలపై 2 శాతం ధరల పెంపును ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 ప్రారంభమైన తరువాత బెంజ్ కంపెనీ తన వాహనాల ధరలను పెంచడం ఇది రెండో సారి. సంస్థ జనవరిలో కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు ఫారెక్స్‌లో అస్థిరత మరియు వాహనాల తయారీలో పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు కారణమని పేర్కొంది.
ధరల పెరుగుదల C-క్లాస్, EQS, E-క్లాస్ LWB, S-క్లాస్, EQA, EQB, EQS, EQE, GLC, GLA, GLE, GLS, CLE క్యాబ్రియోలెట్ వంటి కార్ల మీద మాత్రమే కాకుండా కొత్తగా ప్రారంభించిన V-క్లాస్ వంటి మోడళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.


