భారీ పేలుళ్లు : బుర్జ్‌ ఖలీఫా చుట్టూ దట్టమైన పొగ | Black Smoke Seen Near Dubai Burj Khalifa Amid Gulf Tensions, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

భారీ పేలుళ్లు : బుర్జ్‌ ఖలీఫా చుట్టూ దట్టమైన పొగ

Mar 13 2026 7:34 PM | Updated on Mar 13 2026 8:00 PM

Black Smoke Seen Near Dubai Burj Khalifa Video goes viral

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌దాడులు, ఇరాన్‌ ప్రతిదాడులోగల్ఫ్‌ ప్రాంతం గజగజ లాడుతోంది. ఈ రోజు (శుక్రవారం)దుబాయ్‌లోని కొన్నిప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa) దగ్గర దట్టమైన పొగ  వ్యాపించిన వీడియోలు వైరల్‌గా మారాయి.


బుర్జ్ ఖలీఫా దగ్గర కనిపించిన పొగ
ఆన్‌లైన్‌లో  వైరల్‌ అవుతున్న  వీడియోలలో ఐకానిక్ బుర్జ్ ఖలీఫా భవనాల పైన నుండి భారీ పొగ ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఆకాశహర్మ్యాల మీదుగా పొగ మేఘాలు అలుముకున్నాయి. ఈ ఘటననగరంలోని కేంద్ర వ్యాపార మండలాల్లో ఆందోళనను పెంచింది. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల భవనాల్లో గణనీయమైన ప్రకంపనలు వచ్చాయని సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడించారు.

 >

ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ ప్రతినిధి ప్రకారం, మొదటి పేలుడు సమీపంలోని నిర్మాణాలను కదిలించేంత బలంగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండో పెద్ద పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలోని నివాసితులు, కార్మికులలో ఆందోళన రేపింది.అయితే ఇది స్వల్ప నష్టం మాత్రమేనని అధికారులు ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement