వారు సజీవంగా లేరు.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు | Donald Trump Sensational Comments On Iran | Sakshi
Sakshi News home page

వారు సజీవంగా లేరు.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Mar 13 2026 3:44 PM | Updated on Mar 13 2026 3:58 PM

Donald Trump Sensational Comments On Iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌ తమకు సరెండర్‌ కాబోతుందన్న ట్రంప్‌.. తమ దాడులకు ఇరాన్‌ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్‌లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్‌ అన్నారు.

మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్‌ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము  చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు.   "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని  నెతన్యాహు అన్నారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement