Burz Kalifa
-
భారీ పేలుళ్లు : బుర్జ్ ఖలీఫా చుట్టూ దట్టమైన పొగ
ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌దాడులు, ఇరాన్ ప్రతిదాడులోగల్ఫ్ ప్రాంతం గజగజ లాడుతోంది. ఈ రోజు (శుక్రవారం)దుబాయ్‌లోని కొన్నిప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) దగ్గర దట్టమైన పొగ వ్యాపించిన వీడియోలు వైరల్‌గా మారాయి.బుర్జ్ ఖలీఫా దగ్గర కనిపించిన పొగఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలలో ఐకానిక్ బుర్జ్ ఖలీఫా భవనాల పైన నుండి భారీ పొగ ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఆకాశహర్మ్యాల మీదుగా పొగ మేఘాలు అలుముకున్నాయి. ఈ ఘటననగరంలోని కేంద్ర వ్యాపార మండలాల్లో ఆందోళనను పెంచింది. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల భవనాల్లో గణనీయమైన ప్రకంపనలు వచ్చాయని సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడించారు.Scenes from downtown #Dubai, United Arab Emirates. The impact on a building in the area can be seen. pic.twitter.com/jg8JrXBXdK— Mina (@Mina696645851) March 13, 2026 >ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ ప్రతినిధి ప్రకారం, మొదటి పేలుడు సమీపంలోని నిర్మాణాలను కదిలించేంత బలంగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండో పెద్ద పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలోని నివాసితులు, కార్మికులలో ఆందోళన రేపింది.అయితే ఇది స్వల్ప నష్టం మాత్రమేనని అధికారులు ప్రకటించారు. -
గ్రేట్ వాల్... గ్రేట్ బ్రిడ్జ్... ఇప్పుడు గ్రేట్ బిల్డింగ్!
రికార్డుల కోసమో, ఇంకో ఉద్దేశంతోనో తెలియదుగానీ... ప్రపంచంలో ఎత్తై ఆకాశహర్శ్వాల నిర్మాణం ఏటికేడాదీ జోరందుకుంటోంది. నిన్నమొన్నటి దాకా దుబాయిలోని బుర్జ్ ఖలీఫా ఓ అద్భుతం అనుకుంటూ ఉంటే, దాన్ని తలదన్నే రీతిలో సౌదీ అరేబియాలో దాదాపు కిలోమీటర్ ఎత్తున్న జెడ్డా టవర్స్ నిర్మాణం పూర్తిస్థాయిలో జరుగుతోంది. ఇప్పుడిక చైనా.. ‘మేమేం తక్కువ తినలేదు’ అన్నట్టుగా రంగంలోకి దిగింది. హాంకాంగ్-షెన్జెన్ మార్గంలోని లౌహౌ జిల్లాలో ఓ భారీ స్కైస్క్రాపర్ నిర్మాణానికి చైనా సిద్ధమవుతోంది. ‘హెచ్700 షెన్జెన్’ అని పిలుస్తున్న ఈ బిల్డింగ్ ఎత్తు దాదాపు 739 మీటర్లు. అంటే ముప్పాతిక కిలోమీటర్‌కు కొంచెం తక్కువన్నమాట! ఫొటోలో కనిపిస్తున్నవి ఆ బిల్డింగ్ నమూనాలే. నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే మూడో ఎత్తై భవనంగా రికార్డు సృష్టిస్తుంది. అయితే ఇదొక్కటే దీని ప్రత్యేకత కాదు. అంతెత్తుమీద ఓపెన్ టాప్ ఉద్యానవనం ఒకటి పచ్చదనాన్ని పంచుతుంది. భవనం మధ్యభాగంలో కొన్ని అంతస్తుల ఎత్తు వరకూ ఏర్పాటు చేసే ఈ స్కైగార్డెన్ ఈ భవనానికి ఓ హైలెట్ అంటోంది ఆర్కిటెక్చర్ సంస్థ బీకేఎల్. ఇప్పటికే ఎత్తై బ్రిడ్జీల నిర్మాణంలో రికార్డులు సృష్టిస్తున్న చైనా ఈ బిల్డింగ్లోనూ ఓ బ్రిడ్జీని నిర్మిస్తోంది. ఇది హెచ్700 షెన్జెన్ పక్కనే నిర్మాణమవుతున్న 680 మీటర్ల ఎత్తై భవనాన్ని కలుపుతుంది. హెచ్700 షెన్జెన్ నిర్మాణ అనుమతుల కోసం బీకేఎల్ ఆర్కిటెక్చర్ స్థానిక ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది.


