breaking news
expolsions
-
Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి
బీరుట్: లెబనాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వాకీటాకీలు, పేజర్ల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. ఇక, తాజాగా వాకీటాకీల పేలుళ్ల కారణంగా దాదాపు 32 మంది మృతిచెందగా.. 450 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బుధవారం పలుచోట్ల పేజర్లు పేలిన ఘటనలో దాదాపు 13 మంది మృత్యువాతపడగా 2800 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాగా, బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితోపాటు సౌర పరికరాలనూ పేలుళ్లకు వినియోగించుకున్నారు. పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో ఇలా మరో పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది. వైర్లెస్ పరికరాలైన పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఈ పరికరాల హ్యాకింగ్ ఎలా జరిగింది అనేది కీలకంగా మారింది. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్‌లో కారుతోపాటు ఒక దుకాణంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బీరుట్‌లోని పలు ఇళ్లలో సౌర పరికరాలూ పేలిపోయాయి. హిజ్బుల్లా గ్రూపునకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలూ పేలాయి. ఇక.. ఇజ్రాయెలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్యల మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.#Pager After pager now Walkie-talkies explode at funeral held for pager victims.Pakistan condemned the attack.#Lebanon pic.twitter.com/pVMV3zQE0K— kiran parmar (@kiranaparmar72) September 19, 2024 అయితే, లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తయారయ్యాయి. వాటిపై ఐకామ్ అని ఉంది. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. కాగా, లెబనాన్‌లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామని ఐకామ్ వెల్లడించింది. ఇక, ఇవి చేతితో పట్టుకునే విధంగా రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హిజ్బోల్లా ఐదు నెలల కిందట కొనుగోలు చేసింది. ఇక, తాజాగా ఈ పరికరాలు పేలిన కారణంగా భారీ నష్టం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై భీకరంగా దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్త తరహా దాడులో లెబనాన్‌పై విరుచుకుపడుతోందని పలువురు చెబుతున్నారు. అందులో భాగంగా ఇలా అనూహ్య పేలుళ్ల ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ తన సైనికులతో యుద్ధం మరో అంకంలోకి ప్రవేశించిందని, మరింత ధైర్యం, అంకిత భావం అవసరమని సూచించారు. సైన్యం సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లోకి భారీగా సైన్యాన్ని ఇజ్రాయెల్ తరలిస్తోంది. All types of electric devices owned by Hezbollah are now blowing up in #Lebanon and the region.Apart from pagers & walkie-talkies, other devices such as fingerprint devices, solar power, radios, phones, batteries are now exploding too. #LebanonBlastpic.twitter.com/FIm5RH9UpA— Arun Pudur (@arunpudur) September 18, 2024ఇది కూడా చదవండి: ట్రంప్‌కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన యూనియన్ -
భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం
సెంట్రల్ మాలీలో విషాద ఘటన జరిగింది. పేలుడు పరికరాన్ని బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు ధాటికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. జిహాదీల హింసకు నిలయమైన మోప్టీ ప్రాంతంలో ఈ ఘోర పేలుడు ఘటన జరిగింది. జీహాదీలకు కేరాఫ్ అడ్రగ్ అయిన ఈ ప్రాంతంలో తరచూ రక్తపాతం జరుగుతోంది. హింసాత్మక ఘటనలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది మాలీని విడిచిపెట్టారు. చదవండి: బాప్రే!...ఆమె కంటిలో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లు... -
బాంబు పేలుళ్లు.. 165 మంది మృతి
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ లో నరమేధం సృష్టించారు. శనివారం అర్థరాత్రి సమయంలో రాజధాని బాగ్దాద్‌లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ముష్కర మూక బాంబు దాడులకు తెగబడింది. రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడుల్లో 165 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 125గా బీబీసీ పేర్కొంది. ఎంత మంది మృతి చెందారనేది ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్దాలను నింపి పేల్చివేశారు. ఈ ఘటనలో వంద మందిపైగా మందికి పైగా మృతి చెందారు. భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.