ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ కొరత భయాందోళనలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ సిలిండర్ల ప్యానిక్ బుకింగ్స్ మాత్రం అధికంగానే కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల యుద్ధం కారణంగా అనిశ్చిత పరిస్థితి రావొచ్చేమోనని భయంతో ప్రజలు ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ఇందులో గ్యాస్ సిలిండర్ అంశం ఒకటి.
అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడీయో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే గ్యాస్ సిలిండర్‌ను ఇలా కూడా వాడొచ్చా అనిపించకమానదు. నెట్టింటిలో వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఓ వ్యక్తి.. ఖాళీ సిలిండర్ తీసుకుంటాడు. దాన్ని వెల్డింగ్ పనిముట్ల సాయంతో కట్ చేసి.. దాన్ని కట్టెల పొయ్యి మాదిరిగా మార్చేశాడు.
ఇలా ఫుల్ గ్యాస్ సిలిండర్ లేదనే చింతను తీర్చుకున్నాడు. ఈ వ్యక్తి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడు మాములోడు కాదురా నాయనా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ భయాందోళనలు నడుస్తున్న నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఇలా వైరల్ కావడానికి కూడా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మన భారతీయుల టాలెంట్ మామూలు టాలెంట్ కాదుగా 👍
pic.twitter.com/AVN1cCRPTS— UttarandhraNow (@UttarandhraNow) March 13, 2026


