ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నాలుగో ఎడిషన్ ఎలాంటి మెరుపుల్లేకుండా సప్పగా ప్రారంభమైంది. టోర్నీ ఓపెనర్‌లో దుబాయ్ క్యాపిటల్స్, డెజర్ట్ వైపర్స్ తలపడగా.. వైపర్స్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. 39 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. నబీ 29, అటల్ 16, జహంగీర్ 19, గుల్బదిన్ డకౌట్, కాక్స్ 2, విల్లే 10, షకన 12, కర్రీ 5 (నాటౌట్), హైదర్ అలీ 4 (నాటౌట్) పరుగులు చేశారు.
వైపర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, తన్వీర్, నూర్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. నసీం షా, సామ్ కర్రన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో వైపర్స్ కూడా తడబడింది. అతి కష్టం మీద 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆండ్రియస్ గౌస్ (58) బాధ్యతాయుతంగా ఆడి వైపర్స్‌ను గెలిపించాడు.
ఫకర్ జమాన్ 26, హెల్డన్ 16, సామ్ కర్రన్ 7, డాన్ లారెన్స్ 19 నాటౌట్, హెట్‌మైర్ 7, హసన్ నవాజ్ 3, తన్వీర్ 12 నాటౌట్ పరుగులు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో కర్రీ, సలాంకిల్ తలో 2, నబీ, నైబ్ చెరో వికెట్ తీశారు. ఇవాళ షార్జా వారియర్జ్, అబుదాబీ నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.


