
సీఎస్‌కే జెర్సీలో అశ్విన్(PC: IPL/bcci)
ఇంటర్ననేషనల్ టీ20 లీగ్-2026 వేలంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఘోర అవమానం ఎదురైంది. రూ. 1.06 కోట్ల కనీస ధరతో తొలి రౌండ్ వేలంలోకి వచ్చిన అశ్విన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
ఈ ఏడాది ఆగస్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అయిన అశ్విన్ విదేశీ లీగ్‌లలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐఎల్‌టీ20 వేలంలో తన పేరును అశూ రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ ఈ సీనియర్ స్పిన్నర్ తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.
దీంతో అశ్విన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అశ్విన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఐదు ఫ్రాంచైజీల తరపున 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 187 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
2010,2012 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. మొత్తంగా ఈ తమిళనాడు స్పిన్నర్ 333 టీ20 మ్యాచ్‌ల్లో 317 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో అశ్విన్ సీఎస్‌కే తరపున ఆడాడు. అతడిని సీఎస్‌కే ఏకంగా రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
అటువంటి ప్లేయర్ ఐఎల్‌టీ20 వేలంలో అమ్ముడుపోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోది. అయితే భారత లెజెండరీ స్పిన్నర్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. బిగ్ బాష్ లీగ్ (BBL) సీజన్ 15లో సిడ్నీ థండర్స్ తరపున ఆడేందుకు అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మెన్స్ క్రికెటర్‌గా అశ్విన్ నిలవనున్నాడు. కాగా అశ్విన్ గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs AUS: ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్