టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శుభవార్త చెప్పాడు. ప్రియురాలు సోఫీ షైన్‌తో వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘చిరునవ్వుల నుంచి కలల దాకా అన్నీ పంచుకున్నాం. ప్రేమ మమ్మల్ని దీవించింది.
చిరకాల ప్రయాణానికి నాందిగా మేము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాము’’ అని శిఖర్- సోఫీ పేరిట సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్కనీలో ఎర్ర గులాబీలతో అందంగా అలంకరించిన హృదయాకారం ముందుకు శిఖర్ చేయి చాచగా.. సోఫీ తన వజ్రపు ఉంగరాన్ని చూపిస్తూ అతడి చేతి మీద చేయి వేసిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

శుభాకాంక్షల వెల్లువ
కాబోయే వధూవరులు శిఖర్ ధావన్- సోఫీ షైన్‌లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫిబ్రవరి మూడోవారంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా సత్తా చాటిన శిఖర్ ధావన్ గతంలో.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు.
కుమారుడికీ దూరం
అన్యోన్యంగా కనిపించిన ఈ జంటకు కుమారుడు జొరావర్ ధావన్ సంతానం. అంతకుముందు పెళ్లి ద్వారా ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్ వాళ్లు కూడా తన సొంత కూతుళ్లలాంటి వారే అని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే, కొన్నాళ్లకు శిఖర్- ఆయేషా మధ్య విభేదాలు తలెత్తి తీవ్రరూపం దాల్చాయి.

ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. కొడుకు కూడా ధావన్‌కు దూరమయ్యాడు. దీంతో కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న ధావన్.. కొంతకాలం క్రితం ఐర్లాండ్ భామ సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు ఈ జంట. కాగా సోఫీ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ అని సమాచారం. అబుదాబిలోని ఓ కంపెనీకి ఆమె వైస్ ప్రెసిడెంట్ అని తెలుస్తోంది.
చదవండి: బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలు మార్చండి!.. స్పందించిన బీసీసీఐ


