
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా-ఎ జట్టు బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను ఉతికారేశారు. కాన్పూర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ఆర్య 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేయగా.. అయ్యర్ 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు.
వీరిద్దరితో పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రియాన్ పరాగ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67), బదోని(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలా వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లోభారత ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఆర్య తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించారు. అంతకుముందు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఈ నెలలో భారత సీనియర్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో భారత్ ఆసీస్‌తో తలపడనుంది.
చదవండి: ఆసీస్‌పై విధ్వంసకర శతకం బాదిన ప్రియాంశ్ ఆర్య.. తొలి మ్యాచ్‌లోనే..!