స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును జనవరి మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ జనవరి 3 లేదా 4న వర్చువల్‌గా సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో కివీస్‌తో వన్డేల కోసం కోసం భారత జట్టును ఖరారు చేయనుంది.
గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. కివీస్‌తో వన్డే సిరీస్‌లో జట్టును నడిపించేందుకు గిల్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ మధ్యలో మెడ గాయం కారణంగా వైదొలిగిన గిల్.. వన్డేలకు దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలను చేపట్టాడు. అనంతరం గిల్ తిరిగి తిరిగి టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే నాలుగో టీ20కు ముందు గిల్ కాలి మడమ గాయం బారిన పడ్డాడు.
దీంతో ఆఖరి రెండు టీ20లకు కూడా అతడు దూరమయ్యాడు. అనంతరం టీ20 వరల్డ్‌కప్-2026 జట్టులో గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ గిల్ మాత్రం ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం మొహాలీలోని పీసీఏ స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే వన్డే జట్టు పగ్గాలను చేపట్టాక గిల్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్ విఫలమయ్యాడు. దీంతో తన రీఎంట్రీలో న్యూజిలాండ్‌పై సత్తాచాటాలని శుభ్‌మన్ ఉవ్విళ్లూరుతున్నాడు.
మరోవైపు ఆసీస్ పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో (CoE) తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. త్వరలోనే అతడికి వైద్య బృందం ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే అతడు కివీస్‌తో వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు(అంచనా)
శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, తిలక్ వర్మ
చదవండి: నవతరం క్రికెట్‌లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే!


