స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (డిసెంబర్ 2) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ బంగ్లా బౌలర్ల ధాటికి 117 పరుగులకే ఆలౌటైంది. ముస్తాఫిజుర్, రిషద్ హొస్సేన్ తలో 3, షోరిఫుల్ 2, మెహిది హసన్, సైఫుద్దీన్ చెరో వికెట్ తీసి ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టెక్టర్ (17), డాక్రెల్ (19), డెలాని (10) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ తంజిద్ హసన్ (55) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు.
అతనికి పర్వేజ్ హస్సేన్ ఎమోన్ (33 నాటౌట్) సహకరించాడు. అర్ద సెంచరీతో పాటు ఐదు క్యాచ్‌లు పట్టిన తంజిద్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ సిరీస్‌లో ఐర్లాండ్ తొలి మ్యాచ్ గెలువగా.. బంగ్లాదేశ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.


