breaking news
Litton Das
-
ఆసియాకప్-2025కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
ఆసియాకప్-2025 కోసం బంగ్లాదేశ్క్రికెట్ బోర్డు 25 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా గత రెండేళ్లగా జట్టుకు దూరం ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ నూరల్ హసన్‌కు బంగ్లా సెలక్టర్లు తిరిగి పిలపునిచ్చారు.నూరల్ చివరగా బంగ్లాదేశ్ తరపున 2022లో టీ20 మ్యాచ్ ఆడాడు. అంతేకాకుండా పాకిస్తాన్ సిరీస్‌లో భాగం కాని నజ్ముల్ హుస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా ఆసియాకప్‌నకు ముందు బంగ్లాదేశ్ స్వదేశంలో నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం మీర్పూర్లో స్పెషల్ టైనింగ్ క్యాంపు ఏర్పాటు చేసింది. ఆగస్టు 15 నుంచి బంగ్లా ఆటగాళ్ల స్పెషల్ ట్రైనింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 11న అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది.ఆసియాకప్‌నకు బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్. -
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న బంగ్లాదేశ్ పురుషుల జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ క్రమంలో పాక్‌తో టీ20 సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు.శ్రీలంకతో తలపడిన జట్టునే ఈ సిరీస్‌కూ బంగ్లా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఎటువంటి మార్పులు చేయలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లగా తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్, లిట్టన్ దాస్ కొనసాగనుండగా.. మహ్మద్ నైమ్ రిజర్వ్ ఓపెనర్‌గా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. అదేవిధంగా మిడిలార్డర్లో తోహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా మెహది హసన్ మిరాజ్, మెహది హసన్ షేక్ ఉన్న సీనియర్లకు చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జూలై 20 నుంచి 24 వరకు జరగనుంది.మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా ఢాకా వేదికగానే జరగనున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లును పీసీబీ దూరం పెట్టింది.పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టులిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, ఎండీ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్బంగ్లాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్. -
సొంతగడ్డపై శ్రీలంకకు ఊహించని పరాభవం.. చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
ఇటీవలికాలంలో సొంతగడ్డపై ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. అన్ని విభాగాల్లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 16) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌కు శ్రీలంకలో ఇది తొలి టీ20 సిరీస్ విజయం. బంగ్లా కెప్టెన్‌గా లిట్టన్ దాస్‌కు పరాయి గడ్డపై ఇది రెండో టీ20 సిరీస్ గెలుపు. ఈ సిరీస్ గెలుపుతో లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. పరాయి గడ్డపై రెండు టీ20 సిరీస్ విజయాలు సాధించిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. లిట్టన్ గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించాడు. శ్రీలంక, వెస్టిండీస్‌లో కాకుండా బంగ్లాదేశ్ పరాయి దేశాల్లో మరో రెండు టీ20 సిరీస్ విజయాలు మాత్రమే సాధించింది. ఈ రెండు కూడా జింబాబ్వేలో కాగా.. ఒకటి మష్రఫే మొర్తజా నేతృత్వంలో (2012లో 3-1 తేడాతో), మరొకటి మహ్మదుల్లా సారథ్యంలో (2021లో 2-1 తేడాతో) సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. మెహిది హసన్ (4-1-11-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్ (4-0-17-1), రిషద్ హొస్సేన్ (4-0-20-0) కూడా అదే పని చేశారు. షొరిఫుల్ ఇస్లాం (4-0-50-1), తంజిమ్ హసన్ సకీబ్ (2-0-23-0) మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. షమీమ్ హొస్సేన్ 2 ఓవర్లలో ఓ వికెట్ తీసి పర్వాలేనిపించాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (46), దసున్ షనక (35 నాటౌట్), కమిందు మెండిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తంజిద్ హసన్ తమీమ్ (47 బంతుల్లో 73 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో బంగ్లాదేశ్‌కు సునాయాస విజయాన్నందించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (0) ఔటైనా.. లిట్టన్ దాస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్), తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, సిక్స్) తమీమ్‌కు సహకరించారు. ఫలితంగా బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు. -
SL Vs BAN: శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. నిన్న (జులై 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (50 బంతుల్లో 76; ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో.. తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్), షమీమ్ హొసేన్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. వీరు మినహా మిగతా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తంజిద్ హసన్ 5, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 0, మెహిది హసన్ మిరాజ్ 1, జాకెర్ అలీ 3, సైఫుద్దీన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో బినుర ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మహీశ్ తీక్షణ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. బంగ్లాదేశ్ బౌలర్లు ఊహించని రీతిలో రెచ్చిపోవడంతో 15.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కేవలం పథుమ్ నిస్సంక (32), దసున్ షనక (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కుసాల్ మెండిస్ 8, కుసాల్ పెరీరా 0, అవిష్క ఫెర్నాండో 2, అసలంక 5, చమిక కరుణరత్నే 0, వాండర్సే 8, తీక్షణ 6, బినుర 6 పరుగులకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, షోరీఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో 2, ముస్తాఫిజుర్, మెహిది హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టీ20 కొలొంబో వేదికగా జులై 16న జరుగనుంది. కాగా, టీ20 సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లను శ్రీలంక కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ శ్రీలంకలో పర్యటిస్తుంది. -
SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు
29 పరుగుల వద్ద తొలి వికెట్... సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత రెండో వికెట్.. మరో రెండు పరుగులు జతచేసి రెండు వికెట్లు (102/4).. ఆ తర్వాత వైడ్ రూపంలో ఒక పరుగు అంటే అప్పటికి స్కోరు 103/4.. అదే స్కోరు వద్ద ఐదో వికెట్ కూడా డౌన్.. ఒక్క పరుగు జతచేర్చిన వెంటనే ఆరో వికెట్ కూడా పడింది (104/6)..మళ్లీ ఆలస్యం చేయకూడదు అనుకున్నారేమో బ్యాటర్లు.. అదే స్కోరు వద్ద ఏడో వికెట్ కూడా డౌన్.. వైడ్ రూపంలో మరో పరుగు రాగానే ఎనిమిదో వికెట్ కూడా పడిపోయింది.. అప్పటికి స్కోరు 105/8.. మరో పందొమ్మిది పరుగులు రాగానే తొమ్మిదో వికెట్ కూడా పడింది.. 167 పరుగులకు ఆలౌట్..ఐదు పరుగులు, ఏడు వికెట్లుశ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానం ఇది.. 100-1తో పటిష్టంగా కనిపించిన బంగ్లా.. కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే మరో ఏడు వికెట్లు కోల్పోయింది. తమ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జతచేసి ఏడు వికెట్ల నష్టాన్ని చవిచూసింది. లంక బౌలర్ల ధాటికి తాళలేక 167 పరుగులకే కుప్పకూలి.. 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ మేరకు బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన శ్రీలంక ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్ చరిత్రలో.. అత్యధికసార్లు ప్రత్యర్థి జట్టు మీద ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన తొలి జట్టుగా లంక నిలిచింది. లంక ఇలా ప్రత్యర్థిని కుదేలు చేయడం ఇది మూడోసారి.2008లో జింబాబ్వే మీద మూడు పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన లంక.. 2024లో అఫ్గనిస్తాన్ మీద. ఏడు పరుగుల వ్యవధిలో ఈ ఘనత సాధించింది. తాజాగా బంగ్లాదేశ్ మీద ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఫీట్ నమోదు చేసింది.వన్డే క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన జట్లు🏏శ్రీలంక- 2008లో హరారే వేదికగా- జింబాబ్వేను 124-3 నుంచి 127-10కి పడగొట్టింది.🏏శ్రీలంక- 2025లో కొలంబో వేదికగా- బంగ్లాదేశ్‌ను 100-1 నుంచి 105-8కు పడగొట్టింది.🏏వెస్టిండీస్- 1986లో షార్జా వేదికగా- శ్రీలంకను 45-2 నుంచి 51-9కు పడగొట్టింది.🏏శ్రీలంక- 2024లో పల్లెకెలె వేదికగా- అఫ్గనిస్తాన్‌ను 146-3 నుంచి 153-10కు పడగొట్టింది.🏏నేపాల్- 2020లో కీర్తిపూర్ వేదికగా- యూఎస్ఏను 27-2 నుంచి 35-9కి పడగొట్టింది.🏏భారత్- 2014లో మిర్పూర్ వేదికగా- బంగ్లాదేశ్‌ను 50-3 నుంచి 58-10కు పడగొట్టింది.వన్డేల్లోనూ శుభారంభంసొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు... వన్డేల్లోనూ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చరిత అసలంక (123 బంతుల్లో 106; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.టెస్టు సిరీస్‌లో దంచికొట్టిన పాథుమ్ నిసాంక (0), నిశాన్ మధుషనక (6), కమిందు మెండిస్ (0) ఈసారి విఫలమయ్యారు. జనిత్ లియాంగె (29), మిలాన్ రత్ననాయకె (22), వనిందు హసరంగ (22) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. తన్జీద్ హసన్ (61 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్ల ధాటికి కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (0), లిటన్ దాస్ (0), పర్వేజ్ (13), నజు్మల్ షంటో (23), తౌహిద్ హృదయ్ (1) పెవిలియన్‌కు వరుస కట్టారు. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. సంక్లిప్త స్కోర్లు🏏శ్రీలంక- 244 (49.2)🏏బంగ్లాదేశ్- 167 (35.5).చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగాBangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025 -
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో ఆ దేశం తరఫున అత్యధిక మంది ఔట్ చేయడంలో భాగమైన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో దినేశ్ చండీమల్ క్యాచ్ పట్టడం ద్వారా లిట్టన్ దాస్ ఈ ఘనత సాధించాడు. లిట్టన్‌కు ముందు బంగ్లాదేశ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక డిస్మిసల్స్ రికార్డు ముష్ఫికర్ రహీం పేరిట ఉంది. ముష్ఫికర్ 99 ఇన్నింగ్స్‌ల్లో 113 డిస్మిసల్స్లో (98 క్యాచ్‌లు, 15 స్టంపౌట్లు) భాగంగా కాగా.. లిట్టన్ కేవలం 65 ఇన్నింగ్స్‌ల్లోనే (114) ముష్ఫికర్ రికార్డును బద్దలు కొట్టాడు. లిట్టన్ డిస్మిసల్స్లో 99 క్యాచ్లుండగా.. 15 స్టంపౌట్లు ఉన్నాయి.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్‌ల్లో విజయవంతమైన టాప్-4 వికెట్ కీపర్లు..లిట్టన్ దాస్-114ముష్ఫికర్ రహీం-113ఖలీద్ మసూద్-87నురుల్ హసన్-34మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి, 43 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (146) వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఓవర్‌నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య (5) క్రీజ్‌లో ఉన్నాడు.లంక ఇన్నింగ్స్‌లో దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ లహీరు ఉడారా 40 పరుగులతో రాణించాడు. తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్‌కు తలో వికెట్ దక్కింది.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ (రెండో రోజు) మరో 27 పరుగులు జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్‌ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు. నిస్సంక వరుస సెంచరీలుశ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ అద్భుత శతకంతో (146 నాటౌట్) మెరిశాడు.కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్‌ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశారు. -
UAE vs BAN: బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన యూఏఈ
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో చిత్తుగా ఓడి టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ (T20 Series) ఆడేందుకు బంగ్లాదేశ్ యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గత శనివారం (మే 17) తొలి టీ20 జరుగగా.. బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో యూఏఈ బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. లిటన్ దాస్ బృందాన్ని రెండు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.తాంజిద్ హసన్ ధనాధన్అనంతరం బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ యూఏఈ జయభేరి మోగించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమాన్ (0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ (18 బంతుల్లో 40) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ లిటన్ దాస్ (14) సహా తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) పూర్తిగా విఫలమయ్యారు. షమీమ్ హొసేన్ (9), రిషాద్ హొసేన్ (0), తాంజిమ్ హసన్ సకీబ్ (6) కూడా చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో హసన్ మహమూద్ (15 బంతుల్లో 26 నాటౌట్), షోరిఫుల్ ఇస్లాం (7 బంతుల్లో 16 నాటౌట్) మాత్రం దంచికొట్టారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లతో చెలరేగగా.. సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వాళ్లలో ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అర్ధ శతకంతో మెరిసిన అలిషాన్ షరాఫూఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే యూఏఈ ఓపెనర్, కెప్టెన్ ముహమద్ వసీం (9) అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ముహమద్ జోహైబ్ (29)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అలిషాన్ షరాఫూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (13) విఫలం కాగా.. ఆసిఫ్ ఖాన్‌తో కలిసి అలిషాన్ యూఏఈని గెలుపు తీరాలకు చేర్చాడు.అలిషాన్ షరాఫూ కేవలం 47 బంతుల్లోనే 68 పరుగులతో, ఆసిఫ్ ఖాన్ 26 బంతుల్లో 41 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు నష్టపోయి యూఏఈ లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా పొట్టి ఫార్మాట్లో యూఏఈకి బంగ్లాదేశ్‌పై ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. ఇక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అలిషాన్ షారిఫూ దక్కించుకోగా.. ముహమద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్ -
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిట్టన్ కుమార్ దాస్..
పాకిస్తాన్, యూఏఈలతో టీ20 సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌లకు బంగ్లాదేశ్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ కుమార్ దాస్ ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్ అనంతరం బంగ్లా టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు.ఈ క్రమంలోనే తమ టీ20 జట్టు కెప్టెన్‌గా లిట్టన్ కుమార్ దాస్‌ను బంగ్లా క్రికెట్ బోర్డు నియమించింది. ఈ సిరీస్‌లలో లిట్టన్ దాస్ సారథిగా తనను తాను నిరూపించుకుంటే ఫల్ టైమ్‌గా కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోతో పాటు యువ ఆటగాళ్లు షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషాద్ హొస్సేన్‌లకు సెలక్టర్లు చోటిచ్చారు. బంగ్లా జట్టు తొలుత యూఏఈతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు మే 17, మే 19 తేదీలలో షార్జాలో జరగనున్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్ మే 25 నుంచి ప్రారంభం కానుంది.యూఏఈ, పాకిస్తాన్ టీ20 సిరీస్‌లకు బంగ్లా జట్టులిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హొస్సేన్, షక్ మహిదీ హసన్ (వైస్ కెప్టెన్), తన్వీర్ మహ్ముద్, ససనీబ్, తన్వీర్ మహ్మద్, సస్కీమ్, నహిద్ రానా, షోరిఫుల్ ఇస్లాం