
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న బంగ్లాదేశ్ పురుషుల జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ క్రమంలో పాక్‌తో టీ20 సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు.
శ్రీలంకతో తలపడిన జట్టునే ఈ సిరీస్‌కూ బంగ్లా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఎటువంటి మార్పులు చేయలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లగా తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్, లిట్టన్ దాస్ కొనసాగనుండగా.. మహ్మద్ నైమ్ రిజర్వ్ ఓపెనర్‌గా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు.
అదేవిధంగా మిడిలార్డర్‌లో తోహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఆల్‌రౌండర్లగా మెహది హసన్ మిరాజ్, మెహది హసన్ షేక్ ఉన్న సీనియర్లకు చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జూలై 20 నుంచి 24 వరకు జరగనుంది.
మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా ఢాకా వేదికగానే జరగనున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లును పీసీబీ దూరం పెట్టింది.
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు
లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, ఎండీ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్
బంగ్లాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్.