ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ వ్యవహరించనున్నాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) మొహమ్మద్ సైఫ్ హస్సన్ ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న పేసర్ తస్కిన్ అహ్మద్ రీఎంట్రీ ఇచ్చాడు.
వికెట్ కీపింగ్, బ్యాటర్ జాకిర్ అలీ, బ్యాటర్ మహిదుల్ ఇస్లాం అంకోన్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఫామ్‌లో ఉన్నా, స్టార్ బ్యాటర్ నజ్ముల్ హసన్ షాంటోపై వేటు పడింది.
టీ20 ప్రపంచకప్ 2026కు బంగ్లాదేశ్ జట్టు..
- లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్)
- మొహమ్మద్ సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్)
- తంజీద్ హసన్
- మొహమ్మద్ పర్వేజ్ హొసైన్ ఎమోన్
- తౌహిద్ హ్రిదోయ్
- షమీమ్ హసన్
- ఖాజీ నూరుల్ హసన్ సోహాన్
- మహెది హసన్
- రిషాద్ హసన్
- నసుమ్ అహ్మద్
- ముస్తాఫిజుర్ రహ్మాన్
- తంజీమ్ హసన్ సకిబ్
- తస్కిన్ అహ్మద్
- మొహమ్మద్ షైఫుద్దిన్
- షొరీఫుల్ ఇస్లాం
కాగా, ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-సిలో పోటీపడుతుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్ మిగిలిన జట్లుగా ఉన్నాయి. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7 నుంచి తమ జర్నీ ప్రారంభిస్తుంది.
గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 7: వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఫిబ్రవరి 9: ఇటలీ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఫిబ్రవరి 17: నేపాల్ vs బంగ్లాదేశ్ (ముంబై)
ముస్తాఫిజుర్ తొలగింపు
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించారు. వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్‌పై బ్యాన్
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని బంగ్లా క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆదేశించాడు. టీ20 వరల్డ్‌కప్-2026లో తమ లీగ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది.


