
ఆసియాకప్-2025 కోసం బంగ్లాదేశ్‌క్రికెట్ బోర్డు 25 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా గత రెండేళ్లగా జట్టుకు దూరం ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ నూరల్ హసన్‌కు బంగ్లా సెలక్టర్లు తిరిగి పిలపునిచ్చారు.
నూరల్ చివరగా బంగ్లాదేశ్ తరపున 2022లో టీ20 మ్యాచ్ ఆడాడు. అంతేకాకుండా పాకిస్తాన్ సిరీస్‌లో భాగం కాని నజ్ముల్ హుస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా ఆసియాకప్‌నకు ముందు బంగ్లాదేశ్ స్వదేశంలో నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అగ్రశ‍్రేణి క్రికెటర్ల కోసం మీర్పూర్‌లో స్పెషల్ టైనింగ్ క్యాంపు ఏర్పాటు చేసింది. ఆగస్టు 15 నుంచి బంగ్లా ఆటగాళ్ల స్పెషల్ ట్రైనింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 11న అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది.
ఆసియాకప్‌నకు బంగ్లాదేశ్ జట్టు
లిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,
నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్.