చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ | Tanzid enters into record books with highest catches as fielder in a single T20I | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ ప్లేయర్‌

Dec 3 2025 9:21 AM | Updated on Dec 3 2025 10:07 AM

Tanzid enters into record books with highest catches as fielder in a single T20I

ఐర్లాండ్‌తో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (Tanzid Hasan Tamim) అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను ఏకంగా ఐదు క్యాచ్‌లు పట్టాడు. అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఓ ఫీల్డర్‌ (నాన్‌ వికెట్‌కీపర్‌) ఇన్ని క్యాచ్‌లు పట్టడంతో ఇది కేవలం మూడోసారి మాత్రమే. 

టెస్ట్‌ క్రికెట్‌ ఆడే దేశాల పరంగా చూస్తే.. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ తంజిదే. మిగతా ఇద్దరు నాన్‌ టెస్ట్‌ ప్లేయింగ్‌ దేశాలకు చెందిన వారు. మాల్దీవ్స్‌కు వెదగే మలిండ, స్వీడన్‌కు చెందిన సెదిక్‌ సహక్‌ ఆ మిగతా ఇద్దరు.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తంజిద్‌ డాక్రెల్‌, డెలానీ, మార్క్‌ అదైర్‌, హంఫ్రేస్‌, బెంజమిన్‌ వైట్‌ క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో తంజిద్‌ క్యాచ్‌ పట్టడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి అజేయ అర్ద సెంచరీ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 117 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం బంగ్లాదేశ్‌ సునాయాసంగా విజయతీరాలకు చేరింది. తద్వారా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ కూడా కైవసం చేసుకుంది. ఐదు క్యాచ్‌లతో పాటు అజేయ అర్ద సెంచరీ చేసిన తంజిద్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌ తొలి మ్యాచ్‌ గెలువగా.. బంగ్లాదేశ్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement