భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 3) రెండో వన్డే జరుగనుంది. రాయ్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు భారత వెటరన్ స్టార్ రోహిత్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది.
ఈ మ్యాచ్‌లో అతను 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 20000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 13 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో భారత్‌కు చెందిన వారే ముగ్గురున్నారు (సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్). వీరిలో సచిన్ అందరి కంటే ఎక్కువగా 34357 పరుగులు చేసి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..
సచిన్-34357
సంగక్కర-28016
కోహ్లి-27808
పాంటింగ్-27483
జయవర్దనే-25957
కల్లిస్-25534
ద్రవిడ్-24208
లారా-22358
రూట్-21774
జయసూర్య-21032
చంద్రపాల్-20988
ఇంజమామ్-20580
డివిలియర్స్-20014
కాగా, టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో హాఫ్ సెంచరీ, ఓ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ అదిరిపోయే అర్ద సెంచరీతో అలరించాడు. ప్రస్తుత రోహిత్ ఫామ్‌ను బట్టి చూస్తే.. ఇవాల్టి మ్యాచ్‌లో 20000 పరుగుల మార్కును చేరుకోవడం అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు.


