యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి పేట్రేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీ తొలి 3 మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ ఎట్టకేలకు మహారాష్ట్ర బౌలర్లపై జూలు విదిల్చాడు.
58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఓవరాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. వైభవ్ ధాటికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
మరో చరిత్ర
ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ మరో విభాగంలో చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయసులో ముంబైపై 63 బంతుల్లో 109 పరుగులు చేశాడు.


