breaking news
Syed Mushtaq Ali Trophy 2025
-
అక్కడేమో సెంచరీల మోత.. ఇక్కడేమో ఇలా..!
భారత పురుషుల అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో దారుణంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఈ టోర్నీలో సహచరులంతా రాణించినా (పాక్‌తో జరిగిన ఫైనల్ మినహా) మాత్రే ఒక్క మ్యాచ్‌లో కూడా సత్తా చాటలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 13 సగటున, 112 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో దారుణ పరాజయం వరకు మాత్రే వ్యక్తిగతంగా విఫలమైనా, జట్టును విజయవంతంగా నడిపించాడన్న తృప్తి ఉండేది. అయితే ఫైనల్లో వ్యక్తిగత వైఫల్యాలను కొనసాగించడంతో పాటు టాస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులకు మాత్రే టార్గెట్ అయ్యాడు. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమైన మాత్రే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై మాత్రే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్దికి భారీ పరుగులు చేసే ఆస్కారమిచ్చాడు. ఆతర్వాత లక్ష్య ఛేదనలో నిర్లక్ష్యమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మాత్రే వికెట్‌తోనే టీమిండియా పతనం మొదలైంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 156 పరుగులకే చాపచుట్టేసి 191 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ ఓటమి తర్వాత టోర్నీ మొత్తంలో వ్యక్తిగతంగా, ఫైనల్లో కెప్టెన్‌గానూ విఫలమైన ఆయుశ్ మాత్రేపై ముప్పేటదాడి మొదలైంది. దాయాది చేతిలో ఘెరంగా ఓడినందుకుగానూ భారత క్రికెట్ అభిమానులు అతన్ని సోషల్‌మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. ఎంతో గొప్ప ఆటగాడు, కెప్టెన్ అవుతాడనుకుంటే పాక్ చేతిలో ఘోరంగా ఓడి భారత్ పరువు తీశాడంటూ అభిమానులు అక్షింతలు వేస్తున్నారు. ఈ ఓటమి మాత్రే కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.వాస్తవానికి ఆయుశ్ మాత్రే స్థాయి ఇది కాదు. టెక్నికల్‌గా వైభవ్ సూర్యవంశీ లాంటి వారి కంటే చాలా బెటర్ బ్యాటర్. అయినా ఆసియా కప్‌లో మాత్రే ఎందుకో రాణించలేకపోయాడు. కొద్ది రోజుల ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పరుగుల వరద పారించిన అతను.. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చే సరికి తేలిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో మాత్రే 6 ఇన్నింగ్స్‌ల్లో 108.33 సగటున, 166.67 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఆసియా కప్‌కు వచ్చే సరికి మాత్రే ఈ సూపర్ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఇది గమనించిన అభిమానులు రోజుల వ్యవధిలో ఇంత మార్పేంటని అనుకుంటున్నారు. మొత్తంగా ఆసియా కప్‌లో మాత్రే వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా విఫలమై కెరీర్లో మాయని మచ్చను తెచ్చుకున్నాడు. ఈ వైఫల్యాలు ఈ యువ బ్యాటర్‌పై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. ముంబైకి చెందిన 18 ఏళ్ల మాత్రే ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్, ఐపీఎల్లో పేరు తెచ్చుకుంటున్నాడు. గత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన మాత్రే సీఎస్కే తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. ఫలితంగా సీఎస్కే అతన్ని తదుపరి సీజన్‌కు కూడా రీటైన్ చేసుకుంది. మాత్రే ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 660 పరుగులు.. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 458 పరుగులు.. 13 టీ20ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 565 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 విజేతగా జార్ఖండ్ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను 69 పరుగుల తేడాతో చిత్తు చేసిన జార్ఖండ్.. తొలిసారి ఈ దేశవాళీ టీ20 టోర్నీ టైటిల్‌ను ముద్దాడింది. జార్ఖండ్ ఛాంపియన్‌గా నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర.తుది పోరులో కిషన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కిషన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఎంసీఎ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడు కేవలం 45 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు కుషాగ్ర(81) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన కిషన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కిషన్ సాధించిన రికార్డులు ఇవే..👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొట్టమొదటి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.👉ఒకే టీ20 టోర్నమెంట్లో (అంతర్జాతీయ లేదా డొమెస్టిక్) అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ కెప్టెన్‌గా ఇషాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో అతడు 33 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని (30), నికోలస్ పూరన్ (30) పేరిట ఉండేది.👉టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్(5) రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు. కిషన్ ఇప్పటివరకు టీ20ల్లో 6 సెంచరీలు చేశాడు. ఓవరాల్ వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా కిషన్ నిలిచాడు. తొలి స్ధానంలో క్వింటన్ డికాక్(7) ఉన్నాడు.👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డును ఇషాన్ సమం చేశారు. ఈ దేశవాళీ టోర్నీలో వీరిద్దరూ ఇప్పటివరకు చెరో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.👉ఒకే టోర్నమెంట్లో వికెట్ కీపర్ కెప్టెన్‌గా రెండు సార్లు సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్‌గా ఇషన్ నిలిచాడు.కిషన్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ నుంచి తప్పించింది. ఆ తర్వాత మళ్లీ అతడు డొమాస్టిక్ క్రికెట్ ఆడడంతో తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. కానీ జట్టులోకి మాత్రం ఇంకా పునరాగమనం చేయలేదు.చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడు.. జైస్వాల్‌కు ఏమైంది?
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ అందింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జైసూ.. దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ముంబై తరపున బరిలోకి దిగాడు.మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడి 145 పరుగులు సాధించాడు జైసూ (Yashasvi Jaiswal). ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే, రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. అయినప్పటికీ పుణె వేదికగా రాజస్తాన్‌తో మ్యాచ్ బరిలో దిగి.. 15 పరుగులు చేసి అవుటయ్యాడు. తీవ్రమైన కడుపు నొప్పిఅయితే, ఈ సూపర్ లీగ్ మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన పుణెలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొట్టలో తీవ్రమైన ఇన్షెక్షన్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఫుడ్ పాయిజన్ (Food Poison) అయింది. పుణె హోటళ్లో జైస్వాల్ తిన్న కలుషిత ఆహారమే ఇందుకు దారితీసింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిల్లాడాడు.రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడుఅయితే, వైద్యుల చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు కిలోల బరువు తగ్గిపోయాడు. పూర్తిగా కోలుకోవడానికి 7- 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు’’ అని పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో జైస్వాల్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్‌తో సిరీస్ నాటికి 23 ఏళ్ల ఈ యువ ఓపెనర్ తిరిగి టీమిండియాతో చేరే అవకాశం ఉంది. కాగా రాజస్తాన్‌తో సూపర్ లీగ్ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ.. నెట్ రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో పుణె వేదికగా గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించి జార్ఖండ్ విజేతగా నిలిచింది.చదవండి: AUS vs ENG: ఆర్చర్‌పై స్టోక్స్ ఫైర్!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై -
కెప్టెన్ ఇషాన్ కిషన్ కొట్టేశాడు!
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్ గెలుచుకుంది. హర్యానాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో దేశీ టోర్నీల్లో ఓవరాల్‌గా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో హర్యానా- జార్ఖండ్ (Haryana Vs Jharkhand) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్యానా.. జార్ఖండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.101 పరుగులుమరో ఓపెనర్ విరాట్ సింగ్ (2) విఫలమైనా.. ఇషాన్ (Ishan Kishan) మాత్రం నిలకడగా ఆడాడు. 45 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్స్‌లు బాది 101 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ కుశాగ్రా మెరుపు హాఫ్ సెంచరీ (38 బంతుల్లో 81)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 177 పరుగులు జోడించారు.ధనాధన్ ఇన్నింగ్స్‌అనంతరం అనుకుల్ రాయ్ (20 బంతుల్లో 40), రాబిన్ మింజ్ (14 బంతుల్లో 31) కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సమంత్ జేఖర్, సుమిత్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జార్ఖండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్లలో అర్ష్ రంగా (17) ఓ మోస్తరుగా ఆడగా.. కెప్టెన్ అంకిత్ కుమార్, వన్‌డౌన్‌లో వచ్చిన ఆశిష్ సివాజ్ డకౌట్ అయ్యారు.పోరాడిన మిడిలార్డర్ఇలాంటి దశలో మిడిలార్డర్లో యశ్వర్ధన్ దలాల్ (22 బంతుల్లో 53), నిషాంత్ సింధు (15 బంతుల్లో 31), సమంత్ జేఖర్ (17 బంతుల్లో 38) ధనాధన్ ఆడి.. ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జార్ఖండ్ బౌలర్లు వారిని వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపారు.ఆఖర్లో పార్త్ వట్స్ (4), సుమిత్ కుమార్ (5), అన్షుల్ కాంబోజ్ (11) తడబడగా.. అమిత్ రాణా (13 నాటౌట్), ఇషాంత్ భరద్వాజ్ (17) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హర్యానా 193 పరుగులకే ఆలౌట్ కావడంతో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో గెలిచింది.జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాల్ క్రిష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. వికాస్ సింగ్, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్ గెలుచుకున్న జార్ఖండ్.. తాజాగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో దేశీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు That winning feeling! 🥳Time for celebration in the Jharkhand camp as they win the Syed Mushtaq Ali Trophy for the first time 🙌Scorecard ▶️ https://t.co/3fGWDCTjoo#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/qJB0b2oS0Y— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
ఫైనల్లో ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్-2025 ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం నాటి ఫైనల్‌తో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాతో టైటిల్ పోరులో టాస్ ఓడిన జార్ఖండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో విరాట్ సింగ్ (2) విఫలం కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.శతక్కొట్టిన ఇషాన్ కిషన్.. కుశాగ్రా ధనాధన్మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, శతకం పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్ కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (Kumar Kushagra) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు.అనుకుల్, రాబిన్ మింజ్ ధనాధన్ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్రాకు తోడు అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ ధనాధన్ దంచికొట్టారు. అనుకుల్ రాయ్ 20 బంతుల్లో 40 (3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. రాబిన్ మింజ్ 14 బంతుల్లోనే 31 పరుగుల (3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచారు.ఫలితంగా హర్యానాతో ఫైనల్లో జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 262 పరుగులు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సుమిత్ కుమార్, సమంత్ జేఖర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IND vs SA: డబ్బు తిరిగి ఇచ్చేయండి.. స్పందించిన బీసీసీఐLeading from the front! 🫡Ishan Kishan with a magnificent hundred in the #SMAT final 💯The Jharkhand captain walks back for 1⃣0⃣1⃣(49) 👏Updates ▶️ https://t.co/3fGWDCTjoo@IDFCFIRSTBank | @ishankishan51 pic.twitter.com/PJ7VI752wp— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సూపర్ లీగ్ మ్యాచ్‌లో ముంబై అదరగొట్టింది. హర్యానా విధించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. దేశీ టీ20 టోర్నమెంట్ సూపర్ లీగ్‌లోని గ్రూప్-బిలో భాగంగా పుణెలోని డీవై పాటిల్ అకాడమీలో ముంబై- హర్యానా జట్లు ఆదివారం తలపడ్డాయి. 234 పరుగులుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. హర్యానా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 234 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్లలో కెప్టెన్ అంకిత్ కుమార్ (42 బంతుల్లో 89) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటగా.. వన్‌డౌన్ బ్యాటర్ నిశాంత్ సంధు (38 బంతుల్లో 63 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. మిగిలిన వారిలో సమంత్ జేఖర్ (14 బంతుల్లో 31 రిటైర్డ్ అవుట్), సుమిత్ కుమార్ (4 బంతుల్లో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు.శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్‌ఇక హర్యానాకు ధీటుగా బదులిచ్చే క్రమంలో ముంబై ఓపెనర్, టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతక్కొట్టాడు. కేవలం యాభై బంతుల్లోనే ఏకంగా 16 ఫోర్లు, ఒక సిక్స్‌బాది 101 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే (10 బంతులల్లో 21) ఫర్వాలేదనిపించగా.. మూడో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అదరగొట్టాడు.కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన సర్ఫరాజ్.. మొత్తంగా 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2026 వేలానికి ముందు ఈ మేరకు సత్తా చాటి.. తానూ రేసులోనే ఉన్నానంటూ ఫ్రాంఛైజీలకు మరోసారి సందేశం ఇచ్చాడు.17.3 ఓవర్లలోనే ఇక మిగిలిన ముంబై ఆటగాళ్లలో అంగ్క్రిష్ రఘువన్షీ (7), సూయాంశ్ షెడ్గే (13), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (2) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (3 బంతుల్లో 8), అథర్వ అంకోలేకర్ (2 బంతుల్లో 10) మెరుపులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. జైసూ, సర్ఫరాజ్ దంచికొట్టగా.. వీరిద్దరు ఆఖర్లో వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే హర్యానా విధించిన లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాప్ -
నిప్పులు చెరిగిన సిరాజ్.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు చుక్కలు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు. 3.5 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.సిరాజ్ విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 18.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌తో పాటు చామా మిలింద్ (4-0-36-2), త్యాగరాజన్ (4-0-27-2), నితిన్ సాయి యాదవ్ (3-0-26-1), అర్ఫాజ్ అహ్మద్ (1-0-7-1) సత్తా చాటారు.స్టార్లతో నిండిన ముంబై ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (29), హార్దిక్ తామోర్ (29), సూర్యాంశ్ షేడ్గే (28), సాయిరాజ్ పాటిల్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రహానే (9), సర్ఫరాజ్ ఖాన్ (5), రఘువంశీ (4), అంకోలేకర్ (3), తనుశ్ కోటియన్ (2), తుషార్ దేశ్‌పాండే (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ డకౌటయ్యాడు.అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు అమన్ రావ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (40 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరి ధాటికి హైదరాబాద్ 11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సూపర్ లీగ్ పోటీల్లో భాగంగా జరిగింది. -
చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్
సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. ఓ క్రికెటర్ దేశవాలీ అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూసి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం పొందాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్.. ఏమిటా స్టోరీ..?బరోడాకు చెందిన 26 ఏళ్ల వికెట్‌కీపర్ బ్యాటర్ అమిత్ పాసి తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిన్ననే తన దేశవాలీ అరంగేట్రం (టీ20) చేశాడు. తొమ్మిదేళ్లు నిరీక్షించినందుకు అతనికి మంచి ప్రతిఫలమే దక్కింది. తొలి మ్యాచ్‌లోనే (SMATలో సర్వీసెస్‌పై) వరల్డ్ రికార్డు సెంచరీ చేశాడు.టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా పాకిస్తాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ (2015) ప్రపంచ రికార్డును సమం చేశాడు. పాసి, బిలాల్ ఇద్దరూ టీ20 అరంగేట్రాల్లో 114 పరుగులు చేశారు. టీ20 అరంగేట్రంలో ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్ ఇదే.ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురుచూసినా ఫలితం దక్కకపోవడంతో పాసి ఓ దశలో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్ వైపు మళ్లాలని అనుకున్నాడు. కొద్ది రోజులు ఆ ప్రయత్నం కూడా చేశాడు. జితేశ్ శర్మ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో ఎట్టకేలకు పాసి కల నెరవేరింది.అరంగేట్రం మ్యాచ్‌తోనే హీరో అయిపోయాడు. 24 బంతుల్లో అర్ద సెంచరీ చేసి కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా అరంగేట్రంలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.పాసి ఉదంతం క్రీడలో అయినా జీవితంలో అయినా నిరీక్షణ అవసరమన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆశ కోల్పోకుండా పట్టుదలతో ఎదురుచూసే వారికి పాసికి వచ్చినట్లే అవకాశాలు వస్తాయి. పాసికి 2016–17 సీజన్లో బరోడా అండర్–19 జట్టులో చోటు దక్కినా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రతి సీజన్లో జట్టుకు ఎంపికైనా, తుది పదకొండులో అవకాశాలు రాలేదు. స్థానిక స్థాయిలో నిరంతరం రాణించినా, సీనియర్ స్థాయి అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్ ప్రోత్సాహంతో పాసి ఆశ కోల్పోకుండా నిరంతర ప్రయత్నం చేశాడు. పాండ్యా సోదరులు పాసి గురించి తెలిసి ఎదురుపడిన ప్రతిసారి ధైర్యం చెప్పేవారు. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలని హార్దిక్ ఇచ్చిన సలహా అతనికి ప్రేరణగా నిలిచింది.ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు ప్రతిఫలం దక్కింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పాసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ధోనిని ఆరాధించే పాసి, అతనిలాగే దూకుడైన ఆటతీరుతో బ్యాటింగ్ చేస్తాడు. పాసి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి నాలుగు దశాబ్దాల క్రితం వడోదరాకు వలస వెళ్లింది. అతని కుటుంబానిది గుజరాత్లో నీటి సరఫరా చేసే వ్యాపారం. ఆర్థికంగా పాసికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అతడి అన్నయ్య కూడా స్థానిక స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. ప్రస్తుతం అతను కూడా కుటుంబ వ్యాపారంలో భాగంగా ఉన్నాడు. మొత్తంగా చూస్తే పాసి ఉదంతం అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసే వారికి ఓ ప్రేరణగా నిలుస్తుంది. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, పట్టుదల, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం ఉంటే ఒకే ఇన్నింగ్స్ జీవితాన్ని మార్చేస్తుందని పాసి కథ సూచిస్తుంది. -
విధ్వంసకర ఇన్నింగ్స్!.. సన్నీ లియోన్ ఫొటో షేర్ చేసిన అశ్విన్
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో తమిళనాడు జట్టుకు చెందిన ఓ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 333కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో సన్నీ లియోన్ (Sunny Leone) ఫొటో షేర్ చేశాడు.అసలు.. ఆ ఆటగాడికి.. అశూ ఈ పోస్ట్ పెట్టడానికి సంబంధం ఏమిటి అంటారా?!... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్రతో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ విశ్వరాజ్ జడేజా మెరుపు అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో చెలరేగగా.. సమ్మార్ గజ్జార్ (42 బంతుల్లో 66) ధనాధన్ దంచికొట్టాడు. తమిళనాడు బౌలర్లలో సీలం బరాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇసక్కిముత్తు రెండు వికెట్లు తీశాడు. ఆర్. రాజ్‌కుమార్, సన్నీ సంధు చెరో వికెట్ దక్కించుకున్నారు. సాయి సుదర్శన్ మెరుపు శతకంఇక సౌరాష్ట్ర విధించిన 184 లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు 18.4 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, టీమిండియా స్టార్ సాయి సుదర్శన్ మెరుపు శతకం (55 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో దుమ్ములేపాడు.తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులుమరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన బౌలర్ సన్నీ సంధు (Sunny Sandhu) కేవలం తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగానే తమిళనాడు... సౌరాష్ట్రపై మూడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. నటి సన్నీ లియోన్ ఫోటోకు.. చెన్నైలోని సంధు స్ట్రీట్ ఫోటోను జతచేసి షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అశూ ఇలాంటి పోస్ట్ చేశాడని ఎందుకు చర్చించుకున్నారు. అయితే, అంతలోనే మరికొంత మంది అశూ పోస్ట్ వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టారు. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సన్నీ సంధును ప్రశంసించే క్రమంలోనే అశూ ఈ మేరకు పోస్ట్ పెట్టాడని, దీనిని తాము సులభంగానే డీకోడ్ చేశామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అశూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే? 👀 👀 pic.twitter.com/BgevYfPyPJ— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 9, 2025 -
కరుణ్ నాయర్‌కు అక్కడ కూడా చుక్కెదురు
పేలవ ఫామ్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్ నాయర్.. తాజాగా అదే ఫామ్ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్ నుంచి తప్పించబడ్డాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు మంచి ఫామ్‌లో ఉండిన కరుణ్ పొట్టి ఫార్మాట్‌కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్ గత ఎడిషన్ SMAT ఫామ్ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్‌లో విదర్భకు ఆడిన కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. కరుణ్‌ను ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.కరుణ్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్ చేసుకోవడం ఆశ్చర్యకరం.ఇదిలా ఉంటే, కరుణ్ లేని మ్యాచ్‌లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్ ఓవర్లో త్రిపుర ఊహించని విధంగా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది. -
సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా తమిళనాడు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. సాయి సుదర్శన్ ఒంటిచేత్తో తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు వరుసగా ఔటైనా, టెయిలెండర్ సన్నీ సంధు (30) సాయంతో తన జట్టును గెలిపించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. విశ్వరాజ్ జడేజా (70), సమ్మద్ గజ్జర్ (66) మెరుపు అర్ద శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్ 3, ఎసక్కిముత్తు 2, సన్నీ సంధు, రాజ్‌కుమార్ తలో వికెట్ తీశారు.అనంతరం ఛేదనలో తమిళనాడు కూడా తడబడింది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్ ఒక్కడు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత రిత్విక్ ఈశ్వరన్ (29), ఆఖర్లో సన్నీ సంధు సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. సుదర్శన్ దెబ్బకు తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జయదేవ్ ఉనద్కత్ (4-0-30-3), అంకుర్ పవార్ (3.4-0-26-2) తమిళనాడు ఆటగాళ్లను ఇరుకున పెట్టినప్పటికీ సాయి సుదర్శన్ వారిపై ఎదురుదాడి చేసి విజయం సాధించాడు. -
సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్‌లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్‌ల్లో 136.42 స్ట్రయిక్‌రేట్‌తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్‌కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్ స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్ స్టార్ రోహిత్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్ కానీ జైస్వాల్ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.ప్రస్తుతం ఎడిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్ బెర్త్ ఇదివరకే ఖరారైంది. ఈ ఎడిషన్‌లో శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను డిసెంబర్ 8న ఒడిషాతో ఆడనుంది. -
శ్రీకర్ భరత్ మెరుపులు
లక్నో: ఓపెనర్ శ్రీకర్ భరత్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో... దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 7 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (56 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామ్సన్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. రోహన్ కున్నుమ్మల్ (2), మొహమ్మద్ అజహరుద్దీన్ (6), క్రిష్ణ ప్రసాద్ (5), అబ్దుల్ బాసిత్ (2), సల్మాన్ నిజార్ (5), షర్ఫుద్దీన్ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, సౌరభ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 123 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ భరత్ దంచేయగా... అశ్విన్ హెబ్బర్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), పైల అవినాష్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర జట్టు ఐదు విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో సోమవారం విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. అభిషేక్ అదరహో..సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు; 2/8)... సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతు న్నాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 73 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ దంచికొట్టగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (22 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ హాఫ్‌సెంచరీలు నమోదు చేసుకున్నారు. సర్వీసెస్ బౌలర్లలో అభిషేక్ తివారి, విశాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ తివార టరి(30 బంతుల్లో 40; 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లువిఫలమయ్యారు. బౌలింగ్‌లో అభిషేక్, సాన్వీర్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పాండిచ్చేరి 81 పరుగుల తేడాతో బెంగాల్‌పై, గుజరాత్ 1 వికెట్ తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై హర్యానా 8 పరుగుల తేడాతో బరోడాపై విజయాలు సాధించాయి.హైదరాబాద్ ‘టాప్’ షోబిహార్పై ఘనవిజయంకోల్కతా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా... శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో బిహార్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. పియూశ్ సింగ్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), బిపిన్ సౌరభ్ (19 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3, చామా మిలింద్ రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో హైదరాబాద్ 12.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (42 బంతుల్లో 67; 11 ఫోర్లు, 1 సిక్స్), ప్రజ్ఞయ్ రెడ్డి (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తాచాటారు. గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
అభిషేక్ శర్మ రేర్ రికార్డు.. రోహిత్, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు.ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. అదేవిధంగా అభిషేక్ 2025 ఏడాదిలో టీ20ల్లో వంద సిక్స్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు.అభిషేక్ ఈ ఏడాది ఆరంభం నుంచే టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్, ఆసియాకప్, ఆసీస్ టూర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 42.82 సగటుతో 1,499 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 149గా ఉంది.పంజాబ్ ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో సర్వీసెస్ టీమ్‌ను 73 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అభిషేక్‌తో పాటు ఫ్రబ్‌సిమ్రాన్ సింగ్(50), నమన్ ధీర్(54) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అనంతరం సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, హర్‌ప్రీత్ తలా రెండు వికెట్లు సాధించారు. -
దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవం
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన అద్భుత ప్రదర్శనతో జాతీయ సెలక్టర్లకు మరోసారి సవాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో దుమ్ములేపుతున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం పుదుచ్చేరి (Puducherry)తో జరిగిన మ్యాచ్‌లో షమీ నిప్పులు చెరిగాడు. షమీ తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే షమీ సత్తాచాటినప్పటికి బ్యాటర్లు విఫలం కావడంతో బెంగాల్ 81 పరుగుల తేడాతో ఘోర ఓటమి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.పుదుచ్చేరి బ్యాటర్లలో ఆమన్ ఖాన్(74) హాఫ్ సెంచరీ సాధించగా.. జస్వంత్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో షమీతో పాటు చటర్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో బెంగాల్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.పుదుచ్చేరి బౌలర్ల దాటికి బెంగాల్ 13.5 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌గా కరణ్ లాల్(40) మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో జయంత్ యాదవ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. సైదక్ సింగ్ మూడు, అయూబ్, అమన్ ఖాన్ తలా వికెట్ సాధించారు. ఈ సీజన్లో బెంగాల్‌కు ఇది రెండో ఓటమి. -
"బాత్రూంలో కూర్చొని ఏడ్చాను..": రియాన్ పరాగ్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు (Riyan Parag) చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ అంశంపై రియాన్ తాజాగా స్పందించాడు. భారత జట్టులో స్థానం దక్కనందుకు నిరాశ చెందానని చెప్పుకొచ్చాడు.గతేడాది అక్టోబర్‌లో చివరిగా టీమిండియా తరఫున ఆడిన రియాన్ భుజం గాయం తనను జట్టుకు దూరం చేసిందని వాపోయాడు. ఫిట్‌గా ఉన్నప్పుడు తాను రెండు వైట్ బాల్ ఫార్మాట్లు ఆడగల సమర్దుడినని తెలిపాడు. త్వరలోనే భారత జట్టులో కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.రియాన్ మాటల్లో.. "నాకు నేను టీమిండియాకు ఆడగల అర్హుడినని అనుకుంటాను. ఇది నాపై నాకున్న నమ్మకమనుకోండి లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. భుజం గాయం వల్ల ప్రస్తుతం నేను టీమిండియాలో లేను. నేను టీమిండియాకు రెండు వైట్‌బాల్ ఫార్మాట్లలో ఆడగలను"ఫామ్ పెద్ద సమస్య కాదుప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాలీ టీ20 టోర్నీ ఆడుతున్న రియాన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఈ అంశంపై కూడా రియాన్ స్పందించాడు.ఫామ్ అనేది తన దృష్టిలో పెద్ద సమస్య కాదని, పూర్తి ఫిట్నెస్ సాధిస్తే అదంతటదే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.బాత్రూంలో కూర్చొని ఏడ్చానుఇదే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు సీజన్లు 45-50 సగటులో పరుగులు చేశాను. అయితే ఆ వెంటనే జరిగిన ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కలిపి 70 పరుగులు చేయలేకపోయాను. ఆ సమయంలో నేను బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను.ఈ ఫామ్‌తో ఐపీఎల్‌కు సంబంధం లేదుసయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫామ్‌తో ఐపీఎల్ ఫామ్‌కు సంబంధం లేదు. ఇక్కడ పరుగులు సాధిస్తే సంతోషమే. పరుగులు చేయలేకపోతే ఐపీఎల్లో పరుగులు చేయలేనని కాదు. ఈ విషయంలో నాకు అనుభవం ఉందని రియాన్ అభిప్రాయపడ్డాడు.కాగా, 24 ఏళ్ల రియాన్ చివరిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్‌తో జరిగిన T20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్ అంతటిలో కేవలం 49 పరుగులే చేశాడు.సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా సీఎస్కేకు వెళ్లిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. గత సీజన్లో అతను కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా చేశాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కూడా రియాన్ ఐపీఎల్ 2025లో పర్వాలేదనిపించాడు. 32 సగటున 393 పరుగులు చేశాడు. -
దుమ్ములేపిన మహ్మద్ షమీ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి!
దేశవాళీ క్రికెట్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మరోసారి తన అద్భుత ప్రదర్శనతో జాతీయ సెలక్టర్లు సవాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. గురువారం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.తన సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో షమీ కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడి సంచలన ప్రదర్శన ఫలితంగా సర్వీస్‌పై 7 వికెట్ల తేడాతో బెంగాల్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసస్ 18.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మోహిత్ అహ్లావాట్(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నకుల్ శర్మ(32), వినీత్(32) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీతో పాటు ఆకాష్ దీప్ మూడు, ఆఫ్-స్పిన్నర్ వ్రిత్తిక్ ఛటర్జీ రెండు వికెట్లు సాధించాడు.అభిషేక్, అభిమన్యు మెరుపులుఅనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో చేధించింది. అభిషేక్ పోరెల్(56), అభిమన్యు ఈశ్వరన్(58) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ఇది నాలుగో విజయం. ఈ గెలుపుతో బెంగాల్( 16) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.సెలక్టర్లపై విమర్శలు..ఇక దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీకి జాతీయ జట్టులోకి చోటు ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ల సైతం షమీని ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేల్లోనూ భారత బౌలింగ్‌లో అనుభవం లేమి కన్పించింది. దీంతో అనుభవజ్ఞుడైన షమీని ఎందుకు జట్టులోకి తీసుకు రావడం లేదని మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. షమీ చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ లోపం పేరిట అతడిని జట్టులోకి తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు.చదవండి: ENG vs AUS: 'నగ్నంగా నడుస్తానని సవాల్'... హేడెన్ పరువు కాపాడిన జో రూట్ -
సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు దుమ్మురేపుతున్న సంజూ శాంసన్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయమైన 51 పరుగులు చేసిన అతడు.. ఆతర్వాతి మ్యాచ్‌లో 15 బంతుల్లో 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ మరోసారి చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు.ఇదే ఫామ్‌ను సంజూ సౌతాఫ్రికా సిరీస్‌లోనూ కొనసాగిస్తే టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఆఖరి నిమిషం వరకు సంజూ స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. జితేశ్ శర్మ రూపంలో అతడిని బలమైన పోటీ ఉంది.కాగా, నిన్ననే సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ వికెట్‌కీపర్ బ్యాటర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. గాయపడినా ఈ జట్టుకు ఎంపికైన శుభ్‌మన్ గిల్ సిరీస్ సమయానికి అందుబాటులోకి రాకపోతే సంజూ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశారెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.ముంబైని ఓడించిన తొలి మొనగాడుప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైని ఓడించిన ఏకైక కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే. ఈ టోర్నీలో కేరళకు సారధిగా వ్యవహరిస్తున్న సంజూ ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా రాణించి ముంబైని ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంజూ, ఆతర్వాత వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటి కీలక సమయంలో శివమ్ దూబేను స్టంపౌట్ చేశాడు. ఈ వికెటే మ్యాచ్‌ను మలుపు తిప్పి, కేరళను గెలిచేలా చేసింది.స్కోర్ల వివరాలు..కేరళ-178/5ముంబై-163 ఆలౌట్ -
రోహిత్ శర్మ కీలక నిర్ణయం
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు హిట్‌మ్యాన్ సమ్మతం వ్యక్తం చేశాడట. SMATలో ముంబై నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతూ నాకౌట్స్‌కు చేరువైంది.ఇప్పటికే స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబైకి హిట్‌మ్యాన్ తోడైతే వారిని ఆపడం దాదాపుగా అసాధ్యం. ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో ఉంది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ముంబైకి టైటిల్ అందించాడు.ప్రస్తుత ముంబై జట్టులో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. వీరికి రోహిత్ శర్మ కలిస్తే ఇంకేమైనా ఉందా..?ఈ సీజన్లో ముంబై ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కుర్ర ఓపెనర్ మాత్రే వరుసగా రెండో సెంచరీలు బాది జోష్‌లో ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీ చేశాడు. ఇటీవలే శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.ఇదిలా ఉంటే, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ.. 38 ఏళ్ల లేటు వయసులోనూ ఈ ఫార్మాట్లో చెలరేగిపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్ 6 విశాఖ వేదికగా జరుగనుంది.సిరీస్ విషయానికొస్తే.. నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసిన ఓటమిపాలైంది. రుతురాజ్, కోహ్లి సెంచరీలు వృధా అయ్యాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమానమైన పోరాటపటిమ కనబర్చి భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. -
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
-
ఉప్పల్‌లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
-
మరోసారి దడదడలాడించిన అభిషేక్ శర్మ
ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.ఈ టోర్నీలో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్‌పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అనంతరం రాజ్ లింబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌తో పాటు అన్మోల్ప్రీత్ సింగ్ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. నమన్ ధిర్ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్ రావత్ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. -
మరోసారి పేట్రేగిపోయిన వైభవ్ సూర్యవంశీ
యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి పేట్రేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీ తొలి 3 మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ ఎట్టకేలకు మహారాష్ట్ర బౌలర్లపై జూలు విదిల్చాడు. 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఓవరాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. వైభవ్ ధాటికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.మరో చరిత్రఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ మరో విభాగంలో చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయసులో ముంబైపై 63 బంతుల్లో 109 పరుగులు చేశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వైభవ్‌కు ఇదే తొలి శతకం. ఓవరాల్‌గా 16 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో మూడవది. -
పడిక్కల్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ చెలరేగిపోయాడు. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే అజేయమైన శతకం (102) బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.పడిక్కల్‌తో పాటు శరత్ (23 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మరణ్ రవిచంద్రన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 3 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.మిగతా ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ 24, కరుణ్ నాయర్ 4 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్ 2, టి నటరాజన్ ఓ వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత SMAT సీజన్లో ఇప్పటికే ఏడు సెంచరీలు (పడిక్కల్‌ది కాకుండా) నమోదయ్యాయి. ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే 2, అభిమన్యు ఈశ్వరన్, రోహన్ కున్నుమ్మల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఉర్విల్ పటేల్ తలో సెంచరీ చేశారు. -
నేడు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. హార్దిక్ పాండ్యా X అభిషేక్ శర్మ
సాక్షి, హైదరాబాద్: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా నేడు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో బరోడా తరఫున హార్దిక్ ఆడనున్నాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో గాయపడిన హార్దిక్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. సెప్టెంబర్ 26న అతను చివరిసారిగా మ్యాచ్ (శ్రీలంకతో) ఆడాడు. ఈ మ్యాచ్‌లో కండరాల గాయంతో తప్పుకున్న పాండ్యా కొంత విశ్రాంతి తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు చేరుకున్నాడు. అక్టోబర్ 15 నుంచి మధ్యలో మూడు రోజుల దీపావళి సెలవు మినహా నవంబర్ 29 వరకు అక్కడే ఉండి పూర్తిగా కోలుకునే వరకు రీహాబిలిటేషన్ కొనసాగించాడు. మ్యాచ్ ఆడేందుకు పాండ్యా సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. హార్దిక్ ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేసేందుకు మ్యాచ్ ఫిట్‌గా మారాడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) సర్టిఫికెట్ ఇచ్చింది. ‘దాదాపు నలభై రోజుల పాటు సీఓఈ బయటకు కూడా పోకుండా పాండ్యా పూర్తి స్థాయి రీహాబిలిటేషన్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్స్‌ను అన్ని విధాలా పాటించాడు. ఇప్పుడు మ్యాచ్ ఆడటమే మిగిలింది’ అని సీఓఈ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రజ్ఞాన్ ఓజా సమక్షంలో... నిజానికి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాండ్యా డిసెంబర్ 4న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. అయితే బీసీసీఐ సెలక్టర్, హైదరాబాద్‌కే చెందిన ప్రజ్ఞాన్ ఓజా ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కనీసం రెండు మ్యాచ్‌లలో హార్దిక్ ఆట, ఫిట్నెస్ను పరీక్షించాలని సెలక్టర్లు భావించారు. దాంతో నేడు, గురువారం జరిగే రెండు మ్యాచ్‌లు హార్దిక్ ఆడతాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో అతని ప్రదర్శన కీలకం కానుంది. అభిషేక్ మళ్లీ చెలరేగేనా! భారత ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సభ్యుడు అభిషేక్ శర్మ మరోసారి తన టి20 మెరుపులను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం జింఖానా మైదానంలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 16 సిక్స్‌లతో 148 పరుగులు బాదిన అభిషేక్ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గత పోరులో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్, కెపె్టన్ కృనాల్ పాండ్యా మినహా పెద్ద అనుభవం లేని బరోడా బౌలింగ్ అతడిని ఏమాత్రం నిలువరించగలదో చూడాలి. -
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) తన సొంత జట్టు జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయ తెలిసిందే.182 పరుగులుఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జార్ఖండ్... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేయగా... బ్రికమ్ కుమార్ దాస్ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మణిశంకర్ (21 బంతుల్లో 42; 5 సిక్స్‌లు) రాణించారు.సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్జార్ఖండ్ బౌలర్లలో వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జార్ఖండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 113 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. విరాట్ సింగ్ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. ఫలితంగా జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో త్రిపురను చిత్తు చేసి గెలుపు నమోదు చేసింది. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాటీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ ఇషాన్ కిషన్ సాధించిన మూడో సెంచరీ ఇది. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఈ చోటా డైనమైట్ నిలిచాడు.గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2018-19 సీజన్లో జార్ఖండ్ సారథిగా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు శతకాలు బాదాడు ఇషాన్. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ టీ20 ఫార్మాట్లో మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.టీ20 క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏ఇషాన్ కిషన్ (ఇండియా)- జార్ఖండ్ తరఫున 3 శతకాలు🏏ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ తరఫున కలిని 2 శతకాలు🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- ముల్తాన్ సుల్తాన్స్ తరఫున 2 శతకాలు. చదవండి: నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి -
సూర్యవంశీ మరోసారి.. మాత్రే వరుస సెంచరీలు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో నిన్న (నవంబర్ 30) పలు అద్బుత ప్రదర్శనలు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లలో ఆయుశ్ మాత్రే వరుసగా సెంచరీతో విజృంభించగా.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి వారు మెరుపు సెంచరీలతో విరుచుకుపడ్డారు. యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ టోర్నీలో వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.అభి'షేక్' సెంచరీబెంగాల్తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఓవరాల్‌గా 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ ధాటికి పంజాబ్ రికార్డు స్థాయిలో 310 పరుగులు చేయగా.. బెంగాల్ కనీస పోరాటం కూడా చేయలేకపోయింది.విస్ఫోటనం సృష్టించిన పాకెట్ డైనమైట్త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (జార్ఖండ్) విస్ఫోటనం సృష్టించాడు. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ త్రిపురపై ఘన విజయం సాధించింది.మాత్రే వరుస సెంచరీలుముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే మూడు రోజుల వ్యవధిలో రెండో సెంచరీ చేశాడు. ఆంధ్రతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మాత్రే 59 బంతుల్లో అజేయమైన 104 పరుగులు చేసి తన జట్టుకు సునాయాస విజయాన్నందించాడు.వైభవ్ వరుస వైఫల్యాలుఈ టోర్నీలో యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పరంపర కొనసాగుతుంది. జమ్మూ అండ్ కశ్మీర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. సంచలన పేసర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ వైభవ్‌ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో బిహార్‌పై జమ్మూ అండ్ కశ్మీర్ ఘన విజయం సాధించింది.ఇవే కాక నిన్న మరిన్ని చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదయ్యాయి. సంజూ శాంసన్, రజత్ పాటిదార్, రింకూ సింగ్, కరుణ్ నాయర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి నోటెడ్ స్టార్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. -
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
-
శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. బెంగాల్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పంజాబ్ కెప్టెన్.. భారీ శతకం బాదాడు. కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకున్నాడు.ఆది నుంచే బౌలర్లపై అటాక్దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (SMAT)లో భాగంగా ఎలైట్ గ్రూప్-‘సి’లో పంజాబ్- బెంగాల్ (Punjab Vs Bengal) తలపడ్డాయి. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) ఆది నుంచే బెంగాల్ బౌలర్లపై దాడికి దిగారు.148 పరుగులుఆకాశమే హద్దుగా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 148 పరుగులు సాధించాడు. అయితే, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో వ్రితిక్ ఛటర్జీకి క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 35 బంతుల్లోనే 70 పరుగుల సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో పాటు 4 సిక్స్‌లు ఉన్నాయి. మిగతా వారిలో రమణ్‌దీప్ సింగ్ (15 బంతుల్లో 39), సన్వీర్ సింగ్ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. అన్మోల్ప్రీత్ సింగ్ (6 బంతుల్లో 11) కాస్త నిరాశపరిచాడు.ఇక నమన్ ధిర్ (2 బంతుల్లో 7), నేహాల్ వధేరా (2 బంతుల్లో 2) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన పంజాబ్ ఏకంగా 301 పరుగులు సాధించింది. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మొహమ్మద్ షమీ, షక్షైమ్ చౌదరి, ప్రదీప్త ప్రామాణిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 198 పరుగులే చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి బెంగాల్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 66 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్స్‌లు బాది 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.అభిమన్యుకు తోడుగా.. పేసర్ ఆకాశ్ దీప్ (7 బంతుల్లో 31) ఒక్కడే మెరుపు వేగంతో పరుగులు రాబట్టాడు. అయితే, మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పంజాబ్ చేతిలో బెంగాల్ ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నేహాల్ వధేరా, గుర్నూర్ బ్రార్ చెరో రెండు.. అభిషేక్ శర్మ ఒక వికెట్ దక్కించుకున్నారు. భారీ సెంచరీతో కదం తొక్కి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మబెంగాల్తో మ్యాచ్‌లో 148 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ (16 సిక్సర్లు) అరుదైన రికార్డు సాధించాడు. టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో 17 సిక్స్‌లు (146 నాటౌట్)తో మేఘాలయ బ్యాటర్ పునిత్ బిస్త్ అగ్రస్థానంలో ఉన్నాడు.కాగా టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా తిలక్ వర్మ కొనసాగుతున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో ఈ హైదరాబాదీ 67 బంతుల్లో 151 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి.చదవండి: IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రుతురాజ్‌కు చోటు.. పంత్‌కు నో ఛాన్స్ -
అభిషేక్ శర్మ అట్టర్‌ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్
టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 ఎలైట్ రెండో రౌండ్లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టుకు.. సంజూ కెప్టెన్‌గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా పంజాబ్- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.సరిగ్గా 207 పరుగులే చేసి..హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), వన్‌డౌన్ బ్యాటర్ నిషాంత్ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81), సన్వీర్ సింగ్ (16 బంతుల్లో 36 నాటౌట్) అదరగొట్టారు.ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్ సింగ్ (0), రమణ్‌దీప్ సింగ్ (1) విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.కేరళకు పరాభవంమరోవైపు.. తొలి మ్యాచ్‌లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అహ్మద్ ఇమ్రాన్ (12) సహా అబ్దుల్ బాసిత్ (7), సల్మాన్ నిజార్ (18), అఖిల్ స్కారియా (16), షరాఫుద్దీన్ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇద్దరూ విఫలం కావడంతో..ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్‌లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే. -
పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్.. ఐపీఎల్ జట్లకు సందేశం!
భారత క్రికెటర్, మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 23 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. పృథ్వీకి తోడు మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి భారీ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. ఫలితంగా మహారాష్ట్ర.. హైదరాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దేశవాళీ టీ20 టోర్నరమెంట్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో భాగంగా ఎలైట్ గ్రూప్-‘బి’లో ఉన్న మహారాష్ట్ర- హైదరాబాద్ (Hyderabad vs Maharashtra) శుక్రవారం తలపడ్డాయి. కోల్‌కతా వేదికగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ స్టేడియంలో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది.రాణించిన హైదరాబాద్ బ్యాటర్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (12), అమన్ రావు (11) నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (17 బంతుల్లో 26), రాహుల్ బుద్ధి (31) ఓ మోస్తరుగా రాణించారు.మిగిలి వారిలో భవేశ్ సేత్ (19) విఫలం కాగా.. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 32), కెప్టెన్ సీవీ మిలింద్ (20 బంతుల్లో 35 నాటౌట్), మొహ్మద్ అర్ఫాజ్ అహ్మద్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనాకు రెండు, ఆర్ఎస్ హంగ్రేగ్కర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్ ఒక్కో వికెట్ తీశారు.దుమ్ములేపిన ‘మహా’ ఓపెనర్లుఇక హైదరాబాద్ విధించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ పృథ్వీ షా (Prithvi Shaw) 23 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.మరోవైపు... అర్షిన్ కులకర్ణి సైతం ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని.. పన్నెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అజిమ్ కాజీ (8) విఫలం కాగా.. రాహుల్ త్రిపాఠి 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి అర్షిన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఐపీఎల్ జట్లకు సందేశం!కాగా సచిన్ టెండుల్కర్ స్థాయికి చేరుకుంటాడంటూ నీరాజనాలు అందుకున్న పృథ్వీ షా.. అనతికాలంలోనే టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. దేశీ క్రికెట్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్నెస్ లేమి, క్రమశిక్షణా రాహిత్యం కారనంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షాను గతేడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.ఫలితంగా పృథ్వీ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. తర్వాత సొంత జట్టు ముంబైని కూడా వీడి.. ఈ దేశీ సీజన్ ఆరంభంలోనే మహారాష్ట్రతో చేరాడు. తన తప్పుల్ని తెలుసుకుని ఆటపై దృష్టి సారించానన్న పృథ్వీ.. ఫార్మాట్లకు అతీతంగా అదరగొడుతున్నాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు తానూ రేసులో ఉంటాననే సందేశం ఇచ్చాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
సంజూ శాంసన్ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీ
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సీజన్లో కేరళ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపింది. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా ఒడిషా (Kerala Vs Odisha)తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఒడిషా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్వస్తిక్ సమాల్ (14 బంతుల్లో 20), గౌరవ్ చౌదరి (15 బంతుల్లో 29) మెరుగ్గా రాణించారు.176 పరుగులుమిగతా వారిలో వన్‌డౌన్ బ్యాటర్ సుభ్రాంషు నేనాపతి (15) నిరాశపరచగా.. కెప్టెన్ సమంత్రయ్ (41 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. అతడికి తోడుగా సంబిత్ ఎస్ బరాల్ (32 బంతుల్లో 40) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఒడిషా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. కేరళ బౌలర్లలో నిధీశ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆసిఫ్ రెండు, అంకిత్ శర్మ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌండరీల వర్షంఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళకు ఓపెనర్లు కెప్టెన్ సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆది నుంచే ఒడిషా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. సంజూ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు సాధించాడు.సంజూ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీమరోవైపు.. రోహన్ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 121 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ, రోహన్ అజేయంగా నిలవడంతో 16.3 ఓవర్లలోనే కేరళ వికెట్ నష్టపోకుండా 177 పరుగులు సాధించి జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ఓపెనింగ్ జంటగా సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ రికార్డు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కావాల్సినంత ప్రాక్టీస్కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే జట్టులో మరోసారి సంజూకు చోటివ్వలేదు సెలక్టర్లు. ఇక దేశీ టీ20 టోర్నీలో ప్రదర్శన ఆధారంగానైనా టీ20 జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నద్ధమయ్యే క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం -
హైదరాబాద్, ఆంధ్ర శుభారంభం
కోల్‌కతా: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు విజయంతో శుభారంభం చేశాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో సీవీ మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నోలో ఎకానా స్టేడియంలో అస్సాం జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు 29 పరుగుల తేడాతో నెగ్గింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. శివాంగ్ కుమార్ (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెంకటేశ్ అయ్యర్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... రక్షణ్ రెడ్డి 26 పరుగులిచ్చి 2 వికెట్లు, అర్ఫాజ్ అహ్మద్ 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. అజయ్‌దేవ్ గౌడ్, ఆశిష్ శ్రీవాస్తవ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.అనంతరం హైదరాబాద్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), అమన్ రావు (13 బంతుల్లో 16; 2 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (6 బంతుల్లో 9; 1 ఫోర్) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ బుద్ధి (46 బంతుల్లో 59 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (19 బంతుల్లో 18; 1 ఫోర్) నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. తనయ్ అవుటయ్యాక వచ్చిన భవేశ్ సేథ్ (6 బంతుల్లో 9; 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అయితే అర్ఫాజ్ (13 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో రాహుల్ హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చాడు. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్రతో హైదరాబాద్ తలపడుతుంది. -
సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy 2025)లో గుజరాత్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్-సి గ్రూపులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో సర్వీసెస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం కారణంగా గుజరాత్ విజయం నల్లేరు మీద నడకలా మారింది.182 పరుగులుహైదరాబాద్లోని జింఖాన స్టేడియం వేదికగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ గౌరవ్ కొచ్చర్ (37 బంతుల్లో 60) మెరుపు అర్ధ శతకం బాదగా.. అరుణ్ కుమార్ (29), జయంత్ గోయత్ (7 బంతుల్లో 29) రాణించారు.గుజరాత్ బౌలర్లలో హేమాంగ్ పటేల్, అర్జాన్ నాగ్వాస్వల్లా చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, రవి బిష్షోయి, విశాల్ జేస్వాల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆది నుంచే దూసుకుపోయింది.చెలరేగిన ఓపెనర్లుఓపెనర్లలో ఆర్య దేశాయ్ ధనాధన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 60)తో హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.321కి పైగా స్ట్రైక్రేటుతోఉర్విల్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. 321కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టడం గమనార్హం. మిగతావారిలో రిపాల్ పటేల్ డకౌట్ అయినా పెద్దగా ప్రభావం పడలేదు. 12.3 ఓవర్లలోనే కేవం రెండు వికెట్లు నష్టపోయి గుజరాత్ 183 పరుగులు చేసి జయభేరి మోగించింది. శతక వీరుడు ఉర్విల్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.నమ్మకం నిలబెట్టుకున్నాడుకాగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఉర్విల్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు చెన్నై అతడిని రిటైన్ చేసుకుంది. ఇక ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సొంత జట్టు గుజరాత్ తరఫున ఉర్విల్ తొలి మ్యాచ్‌లోనే ఇరగదీయడం గమనార్హం. కాగా ఏడాది ఐపీఎల్లో ఉర్విల్ మూడు మ్యాచ్‌లు ఆడి 68 పరుగులు చేశాడు.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం


