టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ అందింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జైసూ.. దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ముంబై తరపున బరిలోకి దిగాడు.
మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడి 145 పరుగులు సాధించాడు జైసూ (Yashasvi Jaiswal). ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే, రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. అయినప్పటికీ పుణె వేదికగా రాజస్తాన్‌తో మ్యాచ్ బరిలో దిగి.. 15 పరుగులు చేసి అవుటయ్యాడు.
తీవ్రమైన కడుపు నొప్పి
అయితే, ఈ సూపర్ లీగ్ మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన పుణెలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొట్టలో తీవ్రమైన ఇన్షెక్షన్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.
ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఫుడ్ పాయిజన్ (Food Poison) అయింది. పుణె హోటళ్లో జైస్వాల్ తిన్న కలుషిత ఆహారమే ఇందుకు దారితీసింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిల్లాడాడు.
రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడు
అయితే, వైద్యుల చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు కిలోల బరువు తగ్గిపోయాడు. పూర్తిగా కోలుకోవడానికి 7- 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు’’ అని పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో జైస్వాల్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్‌తో సిరీస్ నాటికి 23 ఏళ్ల ఈ యువ ఓపెనర్ తిరిగి టీమిండియాతో చేరే అవకాశం ఉంది.
కాగా రాజస్తాన్‌తో సూపర్ లీగ్ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ.. నెట్ రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో పుణె వేదికగా గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించి జార్ఖండ్ విజేతగా నిలిచింది.
చదవండి: AUS vs ENG: ఆర్చర్‌పై స్టోక్స్ ఫైర్!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై


