
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు. యూఏఈకు చెందిన ఇంటర్ననేషనల్ టీ20 లీగ్ 2025–26 సీజన్‌లో ఆడేందుకు షార్జా వారియర్స్ (Sharjah Warriorz)తో కార్తీక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ స్ధానాన్ని డీకే భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని షార్జా వారియర్స్ హెడ్ కోచ్ జేపీ డుమిని ధ్రువీకరించాడు.
టీ20 క్రికెట్‌లో అత్యంత అనుభవజ్ఞులైన క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకరు. అతడికి అద్బుతమైన టాలెంట్ ఉంది. రాబోయే సీజన్‌లో డీకే మా జట్టుతో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది. టోర్నమెంట్ సమయంలో యువ ఆటగాళ్లకు ఖచ్చితంగా అతడి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతోంది అని డుమిని పేర్కొన్నాడు. ఇదే విషయంపై కార్తీక్ కూడా స్పందించాడు.
"ఎల్ఎల్‌టీ20లో షార్జా వారియర్స్ తరపున ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. షార్జా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారంతా జట్టును ఛాంపియన్‌గా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి టీమ్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా షార్జా నేను ఎల్లప్పుడూ ఆడాలనుకునే ఐకానిక్ స్టేడియాలలో ఒకటి" అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
40 ఏళ్ల కార్తీక్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. 412 టీ2లు ఆడి 7,437 పరుగులు సాధించాడు. ఇందులో 35 అర్ధ శతకాలు ఉన్నాయి. కార్తీక్ భారత క్రికెట్ నుంచి తప్పుకొన్నాక గతేడాది సౌతాఫ్రికా టీ20లో ప్రిటోరియా క్యాపిటల్స్ తరపున ఆడాడు.
అయితే అతడిని సదరు ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడంతో ఇంటర్ననేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. కార్తీక్ ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎల్‌ఎల్‌టీ20 4వ సీజన్ డిసెంబర్ 4న ప్రారంభం కానుంది.
🚨📰| Former KKR captain Dinesh Karthik will play for Sharjah Warriors in the upcoming season of ILT20.
Abhishek Nayar, KKR assistant coach and DK's friend, is the head coach of Sharjah Warriors' sister franchise UP Warriorz.
New connections. 👀 pic.twitter.com/xBKRZwmuUp— KnightRidersXtra (@KKR_Xtra) September 30, 2025
చదవండి: ఆసియాకప్ ఫైనల్లో ఓటమి... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలనం నిర్ణయం