బ్రిస్బేన్: భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్... మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైంది. టీమిండియా వైస్ కెపె్టన్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన నేపథ్యంలో... సహచరిణికి అండగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. దీంతో డబ్ల్యూబీబీఎల్ రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనని నిర్వాహకులకు తెలిపింది. జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకొని తమ ప్లేయర్‌కు వెసులుబాటు కలి్పంచింది.
వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలిచిన అనంతరం జెమీమీ డబ్ల్యూబీబీఎల్‌లో పాల్గొనేందుకు ఆ్రస్టేలియా వెళ్లింది. కొన్ని రోజుల ప్రాక్టీస్ అనంతరం భారత ఓపెనర్ స్మృతి మంధాన వివాహం కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే వివాహం జరగాల్సిన రోజు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో పెళ్లి వాయిదా పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తిరిగి ఆ్రస్టేలియా వెళ్లకూండా స్మృతికి తోడుగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో జెమీమా బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకుంది.
మహిళల బిగ్ బాష్ లీగ్ తదుపరి మ్యాచ్‌ల నుంచి ఆమెను విడుదల చేసింది’ అని బ్రిస్బేన్ హీట్ జట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో డబ్ల్యూబీబీఎల్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు జెమీమా దూరం అయింది. భారత జట్టు తొలిసారి మహిళల వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో జెమీమా కీలక పాత్ర పోషించింది. సెమీఫైనల్లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ ఆ్రస్టేలియాపై అజేయ శతకంతో జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.


