కడప క్రీడాకారులకు శ్రీచరణి ప్రోత్సాహం
తనకందిన ప్రోత్సాహక బహుమతి రూ. 10లక్షలు క్రీడాకారులకు కేటాయింపు
పొగడ్తలకు పొంగిపోకుండా సామాన్యురాలిగా ప్రవర్తన
క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కోచ్‌లతో మమేకం
సాక్షి ప్రతినిధి, కడప: భారతదేశానికి ప్రపంచకప్ గెలిపించడమే కాదు.. దేశ ప్రజల మనస్సూ గెలుచుకుంది. మైదానంలో చిరుతలా కదలడమే కాదు .. చిరు వయస్సులోనే గొప్ప పరిణతి చూపిస్తోంది. ఆమె ఎవరో కాదు భారతజట్టు మహిళా క్రికెటర్..మనసున్న మన చరణి. తనకు కేటాయించిన ప్రోత్సాహక బహుమతిలో రూ.10 లక్షలు అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల కోసం కేటాయించాలని కోరి ప్రజల మన్ననలు చూరగొంది.
జిల్లాలో ఇప్పుడు ఎక్కడా చూసినా శ్రీచరణి పేరు మార్మోగుతోంది. తన ప్రతిభతో జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచడంపై నలుమూలల నుంచి ప్రశంసలు పొందుతోంది. అయినప్పటికీ పొగడ్తలకు ఎక్కడా పొంగిపోలేదు. అంతర్జాతీయ స్థాయికి చేరినప్పటికీ నిన్నమొన్నటి వరకూ ఆరీ్టపీపీలో కలియతిరుగుతూ, కడప క్రికెట్ స్టేడియంలో తరీ్ఫదు పొందుతున్న శ్రీచరణిలాగే ఉండిపోయింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కోచ్‌లతో అదే గురుభక్తితో మెలిగింది. కీర్తి కిరీటం పొందినప్పటికీ నిన్నమొన్నటి శ్రీచరణిలాగే కలుపుగోలుగా ఉండిపోవడం అదో గొప్ప లక్షణంగా పరిశీలకులు వివరిస్తున్నారు.
అకాడమీ క్రీడాకారుల కోసం..
కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ నేతృత్వంలో శుక్రవారం భారత మహిళ క్రికెటర్ శ్రీచరణిని ఘనంగా సత్కరించిన విషయం విదితమే. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్‌చార్జ్ మేయర్ ముంతాజ్‌బేగం పాల్గొన్నారు. జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచిన శ్రీచరణిని ప్రోత్సహిస్తూ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వెంటనే కమలాపురం ఎమ్మెల్యే కూడా రూ.5లక్షలు ప్రకటించారు. అంతలో శ్రీచరణి జోక్యం చేసుకుని తన ముందు కూర్చుని ఉన్న క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న భవిష్యత్ క్రీడాకారులు, అండర్–14 క్రికెట్ టీమ్ సభ్యులను చూపిస్తూ వారి ప్రోత్సాహం కోసం రూ.10లక్షలు కేటాయించాలని సూచించడం ఆమె గొప్పమనస్సుకు ప్రత్యక్ష నిదర్శనం.
నిన్నామొన్నటి వరకూ ఖర్చుల డబ్బులు కోసం అమె ఎంతో కష్టపడింది. మేనమామ కిశోర్‌కుమార్‌రెడ్డి సహకారంతో నెట్టుకొచ్చింది. తాజాగా తనకు దక్కిన గౌరవంలో తనతోటి ట్రైనింగ్ పొందినా, పొందుతున్న క్రీడాకారు ల కోసం రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించడంపై ప్ర శంసలు దక్కుతున్నాయి. చిన్నవయస్సులో అత్యున్న త గౌరవం దక్కించుకున్న చరణికి అంతే పెద్ద మన స్సు ఉందని ఈ ఘటనతో రుజువు కావడం విశేషం.


