సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సూర్య చరిష్మా 21–11, 21–14తో శ్రియాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలిచింది. తెలంగాణకు చెందిన వెన్నెల తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... మేఘన రెడ్డి ముందంజ వేసింది.
వెన్నెల 17–21, 14–21తో ఆదర్శిని శ్రీ (తమిళనాడు) చేతిలో ఓడిపోయింది. మేఘన రెడ్డి 19–21, 21–17, 21–18తో పూర్వా భర్వే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తనిష్‌్క, సాయి ఉత్తేజిత రావు, నవ్య కందేరి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. తని‹Ù్క 15–21, 5–21తో ఇషారాణి బారువా (అస్సాం) చేతిలో, సాయి ఉత్తేజిత 15–21, 12–21తో దీప్షిక సింగ్ చేతిలో, నవ్య 13–21, 21–18, 14–21తో డియాంక వాల్దియా చేతిలో ఓడిపోయారు.


