ఫ్లోరిడా: అమెరికా సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ వరల్డ్ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ 45వ ఏట పెళ్లి చేసుకుంది. ఇటలీకి చెందిన నటుడు, మోడల్ ఆండ్రియా ప్రెటీని ఆమె వివాహమాడింది. దాదాపు ఏడాదిన్నరగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలైలో ఇద్దరి మధ్య నిశ్చితార్ధం జరిగింది. నిజానికి సెపె్టంబర్‌లోనే వీనస్, ప్రెటీ ఇటలీలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.
అయితే వీనస్ విదేశీయురాలు కావడం ఈ పెళ్లికి ప్రభుత్వం తరఫున అధికారిక ముద్ర పొందేందుకు కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. దాంతో తన స్వస్థలం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో వీనస్ మళ్లీ పెళ్లి తంతువును నిర్వహించింది. అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు.
సోదరి సెరెనా విలియమ్సన్ కానుకగా ఇచ్చిన ‘యాట్’పైనే ఐదు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగడం విశేషం. మహిళల సింగిల్స్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న వీనస్ విలియమ్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కలిపి మరో 16 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. ఇటీవలే వాషింగ్టన్ డీసీ ఓపెన్‌ను గెలుచుకున్న వీనస్ టూర్ టైటిల్ సాధించిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా నిలిచింది.


