అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్ | Kollywood stars at Saranya Ponvannan Daughter Wedding Function | Sakshi
Sakshi News home page

Saranya Ponvannan: అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్

Feb 8 2026 7:31 AM | Updated on Feb 8 2026 11:37 AM

Kollywood stars at  Saranya Ponvannan Daughter Wedding Function

ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్‌ గ్రాండ్‌గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో కోలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. హీరో కార్తీ, ధనుశ్‌తో పాటు పలువురు నటులు రిసెప్షన్‌ వేడుకలో సందడి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

కాగా.. శరణ్య పొన్నవన్.. ధనుశ్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ధనుశ్‌కు అమ్మగా కనిపించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా శరణ్య రఘువరన్‌ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్‌ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. 
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement