ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్ | Director Maruthi Trolls After Rajasaab OTT Streaming | Sakshi
Sakshi News home page

Rajasaab Maruthi: ఇన్ని తప్పులున్నాయా? మారుతిని ఆడేసుకుంటున్నారు

Feb 8 2026 5:20 AM | Updated on Feb 8 2026 5:32 AM

Director Maruthi Trolls After Rajasaab OTT Streaming

ప్రభాస్ 'రాజాసాబ్' ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో చూసినప్పుడే ఈ సినిమాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్‌గా రిలీజైన మరింత ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు మారుతిని అయితే నెటిజన్లు వదలట్లేదు. పూర్తిగా ఆడేసుకుంటున్నారు. మూవీలో ఎన్నెన్ని తప్పులున్నాయో ఎత్తిచూపుతూ మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ మూవీ 'రాజాసాబ్'. గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు సినిమా గురించి చాలా విషయాలు చెప్పిన మారుతి.. ఏకంగా తన ఇంటి అ‍డ్రస్ కూడా ఇచ్చాడు. అయితే అదే అతడికి బూమ్‌రాంగ్ అయింది. మూవీ సరిగా తీయలేదనే కోపంతో ప్రభాస్ అభిమానులు.. వందలాది క్యాష్ ఆన్‌ డెలివరీ ఆర్డర్స్ పెట్టి మారుతిని ఇబ్బంది పెట్టినట్లు అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పుడైతే ట్విటర్‌లో ట్యాగ్ చేసి మరీ మారుతిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

'రాజాసాబ్' విషయంలో చాలామంది చేస్తున్న కంప్లైంట్ డూప్. స్టార్ హీరోలు చాలామందికి డూప్ ఉపయోగిస్తుంటారు. ఈ చిత్రంలో డూప్ అనే సంగతి చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. ప్రభాస్ ఫేస్ మార్పింగ్ గురించి స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అలానే సినిమాలో ప్రభాస్ బస్ జర్నీ చేసే సీన్‌లో.. తొలుత గడ్డం ఉండటం, బస్ దిగేసరికి గడ్డం ట్రిమ్ అయిపోవడం, బస్సే మారిపోవడం గురించి సెటైర్లు వేస్తున్నారు.

మహారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా సంజయ్ దత్ పాత్ర సొంతమవుతుంది కదా? మరి పారిపోవడంలో లాజిక్ ఏంటని నెటిజన్లు అడుగుతున్నారు. ప్రభాస్ నానమ్మ మహారాణి అయితే ఇప్పటివరకు ఎలా బతికి ఉంది? ఇంతకీ ఆమె వయసెంత? లాంటి లాజిక్స్ కూడా వేస్తున్నారు. అలానే కోట్ల రూపాయలతో పాటు మహాల్ ఉన్న సంజయ్ దత్ పాత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర దగ్గర రూ.3 లక్షలు కొట్టేయడం ఏంటని అంటున్నారు. ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో లాజిక్స్ లేని సీన్లపై మారుతిని విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement